Love story Day 7 collections: సూపర్ హిట్ అన్నారు.. కానీ ఈ కలెక్షన్స్ తో రిజల్ట్ ఏమిటో తెలిసిపోయింది!
ఫిదా సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ఎంతో ఇష్టంతో చేసిన సరికొత్త లవ్ స్టోరీ కథ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చి 7 రోజులు అవుతోంది. మొదటి వారం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న లవ్ స్టోరీ ఒక విధంగా సెకండ్ వేవ్ అనంతరం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మొత్తానికి సినిమా అదే స్థాయిలో కంటిన్యూ అవుతుందని అందరూ అనుకున్నారు.
కానీ సోమవారం నుంచి సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఊహించని విధంగా ఏడవ రోజు అయితే మరీ తక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 7 రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను అందుకుంది? అలాగే ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకా ఎంత వసూళ్లను అందుకోవాలని అనే వివరాల్లోకి వెళితే..

భారీ టార్గెట్ తో మార్కెట్ లోకి..
లవ్ స్టోరీ సినిమాకు మొదటి నుంచి కూడా అంచనాలు పెరుగుతూ వచ్చాయి ఇక ఈ సినిమాకు తీరికగా మంచి బిజినెస్ ఉందని తెలుసుకున్న నిర్మాతలు నమ్మకం నమ్మకం కలిగిన తర్వాతనే విడుదల చేశారు ఇక ఓవరాల్గా లవ్ స్టోరీ సినిమా 31.2 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఈ కష్ట సమయంలో థియేటర్లలో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంటుందా లేదా అని అనుమానాలు చాలానే వచ్చాయి.

7వ రోజు వచ్చిన కలెక్షన్స్
మొదటి రోజే ఈ సినిమా సెకండ్ వేవ్ అనంతరం అత్యధిక షేర్ అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఆ తర్వాత మొదటి మూడు రోజులు కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కానీ నాలుగో రోజు సోమవారం నాటికి కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇంకా ఏడవ రోజు అయితే మరీ దారుణంగా పడిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు వచ్చిన షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ.18 లక్షలు, సీడెడ్‌లో రూ.10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.5 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 1 లక్ష, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.3 లక్షలు, గుంటూరు జిల్లాలో 0 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.1 లక్షలు, నెల్లూరులో రూ.2 లక్ష వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తం 0.39 లక్షలు షేర్ ను రాబట్టింది.

7 రోజుల్లో వచ్చిన మొత్తం కలెక్షన్స్
ఇక 7రోజుల్లో వచ్చిన టోటల్ కలెక్షన్స్.. నైజాంలో రూ.10.58 కోట్లు, సీడెడ్‌లో రూ.3.56 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.48 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.1.35 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 1.13 కోట్లు, గుంటూరులో రూ.1.30 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.12 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ0.69 కోట్లు వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా..
లవ్ స్టొరీ సినిమా ఏపీ, తెలంగాణలో 7 రోజులకు గాను రూ.22.23 కోట్ల షేర్ అందుకొని, రూ.36.10 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మిగిలిన రాష్ట్రాలలో కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కర్ణాటక, ఇతర రాష్ట్రాలలో ఈ చిత్రం రూ .1.42 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో సుమారు రూ.4.51 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా లవ్ స్టొరీ మొత్తం 28.16కోట్ల షేర్ ను అందుకొని 50.05కోట్ల గ్రాస్ ను దాటింది.

హిట్టవ్వాలి అంటే.. ఇంకా ఎంత రావాలి?
లవ్ స్టొరీ సినిమా రూ.31 కోట్లకుపైగా ప్రీ బిజినెస్ చేయగా ఇప్పటివరకు ఇప్పటివరకు28.16కోట్ల షేర్ దక్కింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే టోటల్ గా రూ.32 కోట్లకుపైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. ఇక మరో 3.84కోట్ల వరకు అందుకుంటే సినిమా ప్రాఫిట్ జోన్ లోకి అడుగు పెట్టె అవకాశం ఉంటుంది. ఏదేమైనా లవ్ స్టొరీ సినిమా వసూళ్లు సోమవారం నుంచి భారీగా తగ్గుతూ వచ్చాయి. ఇక ఈ రోజు రిపబ్లిక్ మూవీ రావడంతో థియేటర్స్ సంఖ్య కూడా తగ్గింది. మరి ఆ ప్రభావం ఎంతవరకు పడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











