బ్రేక్ ఈవెన్ కు దగ్గర్లో గల్లీ రౌడి, సీటిమార్ కలెక్షన్స్.. లవ్ స్టొరీ దెబ్బకి ఒక్కసారిగా డౌన్

బాక్సాఫీస్ వద్ద లవ్ స్టోరీ సినిమా మొత్తానికి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా గత కొంత కాలంగా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం భారీస్థాయిలో విడుదలైన లవ్ స్టోరీ ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మంచి రికార్డులను అందుకుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా రావడం వలన మిగతా రెండు సినిమాల కలెక్షన్స్ పై తీవ్రస్థాయిలో ప్రభావం పడింది. ఎంతో కష్టపడి బ్రేక్ ఈవెన్ సాధించడానికి తుది దశకు చేరుకున్న ఆ రెండు సినిమాలకు లవ్ స్టొరీ మరో గండంలా మారిపోయింది.

సరికొత్త రికార్డులు

సరికొత్త రికార్డులు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి నాగచైతన్య మొదటి కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎమోషనల్ ప్రేమ కథతో దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రేక్షకులను సరికొత్త ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమా కలెక్షన్స్ యూఎస్ లో కూడా భారీ స్థాయిలో ఉన్నట్లు సమాచారం. ఒక విధంగా చెప్పాలంటే కరోనా సెకండ్ వేవ్ అనంతరం భారీ స్థాయిలో వసూళ్లను అందుకున్న సినిమాగా కూడా లవ్ స్టోరీ రికార్డులను బ్లాస్ట్ చేయబోతోంది.

 గల్లీ రౌడి డౌన్

గల్లీ రౌడి డౌన్


అసలు మ్యాటర్ లోకి వెళితే గత వారం ప్రేక్షకులముందుకు వచ్చిన గల్లీ రౌడీ సినిమా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. సందీప్ కిషన్ హీరోగా కోనవెంకట్ నిర్మాతగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి వారం మొత్తంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1.84కోట్ల షేర్ ను అందుకుంది. సినిమా ప్రీ రిలీజ్ ప్రకారం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 3కోట్ల రూపాయల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ లవ్ స్టోరీ సినిమా రావడం కంటే ముందే ఈ సినిమా కలెక్షన్స్ భారీగా తగ్గాయి. ఇప్పుడు లవ్ స్టొరీ రాగానే వసూళ్లు మరింతగా తగ్గిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 సీటిమార్ కూడా డౌటే..

సీటిమార్ కూడా డౌటే..

ఇక మరోవైపు మాస్ హీరో గోపీచంద్ సీటి మార్ సినిమా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడోవారంలోకి అడుగుపెడుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి వారం తప్పితే ఆ తర్వాత పెద్దగా కలెక్షన్స్ అందుకోలేకపోయింది. రెండవ వారం కూడా షేర్ చాలా తగ్గిపోయాయి. ఇక ఈ వారం అయినా బ్రేక్ ఈవెన్ ను సాధించాలని అనుకున్నారు. రెండు వారాల్లో ఈ సినిమా 10.29 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది. ఇక బ్రేక్ ఈవెన్ ను సాధించాలి అంటే మరో రెండు కోట్లు అందుకోవాల్సి ఉంది. కానీ లవ్ స్టోరీ రావడంతో సీటిమార్ సినిమా మళ్లీ ఫామ్ లోకి వస్తుందా లేదా అనేది కాస్త సందేహంగానే ఉంది.

లవ్ స్టొరీ ప్రభావం గట్టిగానే..

లవ్ స్టొరీ ప్రభావం గట్టిగానే..

అన్ని ఏరియాల నుంచి కూడా లవ్ స్టోరీ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. శనివారం, ఆదివారం కూడా ఈ సినిమా కలెక్షన్స్ గట్టిగానే పెరిగే అవకాశం ఉంది. అయితే మాస్ ఆడియన్స్ మాత్రం సిటిమార్ సినిమా వైపు కొంత యూటర్న్ తీసుకుని ఛాన్స్ కూడా ఉంది కాబట్టి బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది చెప్పడం కష్టమే. లవ్ స్టోరీ వచ్చిన తర్వాత ఈ రెండు సినిమాలకు కలెక్షన్స్ పై కాస్త ప్రభావం ఎక్కువగానే పడినట్లు అర్థమవుతోంది. ఇక మరి ఈ వీకెండ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X