Love story day 3 collections.. బాక్సాఫీస్ వద్ద ఆగని వసూళ్ల వరద.. లాభాల్లోకి రావాలంటే ఇంకెంత కలెక్ట్ చేయాలంటే?
అక్కినేని నట వారసుడు నాగచైతన్య, టాలెంటెడ్ నటి సాయిపల్లవి నటించిన లవ్ స్టోరి చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్నది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లలో ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. వారాంతంలో లవ్ స్టోరి చిత్రం వసూళ్ల సత్తాను చాటుకొన్నది. వారాంతంలో అంటే గత మూడు రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

శేఖర్ కమ్ముల డీల్ చేసిన విధానం..
లవ్ స్టోరి చిత్రం కథ, కథనాల విషయానికి వస్తే.. చిన్నారులపై లైంగిక దాడులు, అలాగే కుల, మతాల వివక్ష కథాంశంగా శేఖర్ కమ్ముల లవ్ స్టోరిని తెరకెక్కించారు. సాయిపల్లవి అగ్రకుటుంబానికి చెందిన యువతిగా, నాగచైతన్య దళిత కుటుంబానికి చెందిన యువకుడిగా నటించారు. అగ్ర కుటుంబానికి చెందిన యువతి, దళిత కుటుంబానికి చెందిన యువకుడి మధ్య సాగిన ప్రేమకథలో సున్నితమైన, సంక్లిష్టమైన అంశాలను శేఖర్ కమ్ముల బాగా డీల్ చేయడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తున్నది.

మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టోరి మూవీకి సంబంధించిన మూడో రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో మూడో రోజున రూ.2.54 కోట్లు, సీడెడ్‌లో 83 లక్షలు, ఉత్తరాంధ్రలో 57 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 29 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.20 లక్షలు, గుంటూరులో 31 లక్షలు రూపాయలు, కృష్ణా జిల్లాలో రూ.30.2 లక్షలు, నెల్లూరులో రూ.15 లక్షలు వసూలు చేసింది. మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.5.19 లక్షల నికర వసూళ్లు, రూ.9.10 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మూడు రోజుల కలెక్షన్లు
లవ్ స్టోరి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా గత మూడు రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది. నైజాంలో రూ.8.16 కోట్లు, సీడెడ్‌లో రూ.2.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.1.98 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.05 కోట్లు, పశ్చిమ గోదావరి జి్లాలో రూ.94 కోట్లు, గుంటూరులో రూ.1.14 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.87 లక్షలు, నెల్లూరులో రూ. 54 లక్షల రూపాయలను వసూలు చేసింది. గత మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.17.40 కోట్లు నికర వసూళ్లు, రూ.28.23 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

లవ్ స్టోరి కలెక్షన్లు మూడు రోజుల్లో ప్రాంతాల వారీగా
ఇక తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టోరి సినిమా రిలీజైన శుక్రవారం నుంచి ఆదివారం వరకు కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. తొలి రోజున ఈ చిత్రం రూ. 7.13 కోట్లు నికర వసూళ్లు, రెండో రోజున రూ.5.08 కోట్లు, మూడో రోజున రూ.5.19 కోట్లు వసూలు చేసింది. అంటే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజుల్లోనే రూ.17.40 కోట్ల నికర, రూ.28.23 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఇలా..
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో కూడా లవ్ స్టోరి సినిమాకు మంచి స్పందన, వసూళ్లు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.17.40 కోట్లు నికర వసూళ్లు, రూ.28.23 కోట్ల గ్రాస్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం 92 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో సుమారు రూ.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.22.07 కోట్లు నికర, రూ.37.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
Recommended Video

లాభాల్లోకి రావాలంటే..
ఇక లవ్ స్టోరి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.31.2 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.32 కోట్లకుపైగానే వసూలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.22.07 కోట్లు వసూలు చేసింది. అంటే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.9.93 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత వసూళ్లను బట్టి చూస్తే త్వరలోనే ఈ చిత్రం భారీ లాభాల్లోకి చేరుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











