twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Love story day 4 collections..తుఫాన్‌ను ఎదురించిన లవ్ స్టోరి కలెక్షన్లు..అమెరికాలో సరికొత్త రికార్డు

    |

    తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ పరిస్థితులు ప్రతికూలంగా మారిన నేపథ్యంలో కూడా లవ్ స్టోరి చిత్రం కలెక్షన్ల ప్రవాహం భారీగా కొనసాగింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం వరుసగా నాలుగో రోజు కూడా బాక్సాఫీస్‌ను కుదిపేసింది. అయితే సాధారణంగా తొలివారాంతం తర్వాత కలెక్షన్లు తగ్గుతాయనే అపోహలకు ఈ సినిమా బ్రేక్ వేసి... రికార్డుస్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం నాలుగో రోజున ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే..

    Genelia D'Souza: ఏళ్ళు గడిచినా హాసిని అందం అస్సలు తగ్గలేదు.. హాట్ ఫొటోస్Genelia D'Souza: ఏళ్ళు గడిచినా హాసిని అందం అస్సలు తగ్గలేదు.. హాట్ ఫొటోస్

    తుఫాన్ పరిస్థితుల్లో కూడా

    తుఫాన్ పరిస్థితుల్లో కూడా

    భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో తొలి వారాంతం తర్వాత వచ్చే సోమవారం కలెక్షన్లు తగ్గుతాయనే వాదన ఏన్నో ఏళ్లుగా వస్తున్నది. అయితే లవ్ స్టోరి చిత్రం ఆ వాదనను కొట్టి పడేసేలా లవ్ స్టోరి భారీ వసూళ్లను సాధించడం సినీ, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తుఫాన్ లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ చిత్రం నిలకడగా వసూళ్లు రాబట్టడం విశేషంగా మారింది.

    రెండు లాక్‌డౌన్ల తర్వాత థియేటర్లలోకి

    రెండు లాక్‌డౌన్ల తర్వాత థియేటర్లలోకి

    రెండు లాక్‌డౌన్ల తర్వాత థియేటర్లోకి వచ్చిన లవ్ స్టోరి చిత్రం రికార్డు స్థాయి కలెక్షనను రాబడుతున్నది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.13 కోట్ల నికర వసూళ్లను, రెండో రోజున రూ.5.08 కోట్లు, మూడో రోజున రూ.5.19 కలెక్షన్లు, నాలుగో రోజున రూ.2.52 కోట్లు వసూలు చేయడం గమనార్హం. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.19.92 కోట్లు నికరంగా, రూ.32 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    నాలుగో రోజున వసూళ్లు ఇలా..

    నాలుగో రోజున వసూళ్లు ఇలా..

    ఇక నాలుగో రోజున తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టోరి చిత్రం సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ.1.28 కోట్లు, సీడెడ్‌లో 41 లక్షలు, ఉత్తరాంధ్రలో 23 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 10 లక్షలు, గుంటూరులో 11 లక్షలు, క‌ృష్ణా జిల్లాలో 14 లక్షలు, నెల్లూరులో 10 లక్షలు వసూలు చేసింది. నాలుగో రోజున రూ.2.52 కోట్ల నికర వసూళ్లు, రూ.4.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    అమెరికాలో రికార్డు సృష్టించిన లవ్ స్టోరి

    అమెరికాలో రికార్డు సృష్టించిన లవ్ స్టోరి

    అమెరికాలో లవ్ స్టోరి వసూళ్ల ప్రభంజనం సాగిస్తున్నది. ఆదివారం రోజుకే 1 మిలియన్ డాలర్ క్లబ్బుల చేరిన ఈ చిత్రం అమెరికాలో 2021 సంవత్సరంలో అత్యధికంగా కలెక్షన్లు సాధించిన చిత్రం రికార్డును నెలకొల్పింది. తొలి వారం ముగిసే లోపు 1.5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో ఈ చిత్రం ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.

    ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్‌లో అంటే..

    ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్‌లో అంటే..

    ఓవరాల్‌గా నాలుగు రోజుల్లో లవ్ స్టోరి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.20 కోట్లు నికరంగా, రూ.32 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకోగా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.4.20 కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.25.22 కోట్లు నికరంగా.. రూ.44 .5 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    బ్రేక్ ఈవెన్ రావాలంటే..

    బ్రేక్ ఈవెన్ రావాలంటే..

    ఇక లవ్ స్టోరి చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.31.2 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం 32 కోట్ల లక్ష్యంతో బాక్సాఫీస్ బరిలో దిగింది. అయితే ఇప్పటి వరకు రూ.25.22 కోట్లు రాబట్టడంతో ఇంకా ఈ చిత్రం రూ.6.78 కోట్లు సాధించాల్సి ఉంది. అయితే ఈ తొలి వారం ముగిసే సమయానికి లవ్ స్టోరి చిత్రం లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

    English summary
    Sai Pallavi and Naga Chaitanya's Love Story movie released on September 24th worldwide. Love Story is getting good collections at Worldwide. Here is the three days collections are..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X