Love Story day 5 collections: కలెక్షన్లపై భారీ దెబ్బ..అయినా అమెరికాలో సరికొత్త రికార్డు..తొలి భారతీయ చిత్రంగా!
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటించిన లవ్ స్టోరి చిత్రంపై తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ పరిస్థితులు భారీగా దెబ్బ తీశాయి. రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రానికి గులాబ్ తుఫాన్ అడ్డంకిగా నిలిచింది. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా లవ్ స్టోరి నిలకడగా కలెక్షన్లు సాధించడం విశేషంగా మారింది. అయితే అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 2021లో ఏ భారతీయ చిత్రం సాధించలేని రికార్డును నెలకొల్పింది. లవ్ స్టోరి చిత్రం 5 రోజుల కలెక్షన్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం...

5వ రోజున లవ్ స్టోరి కలెక్షన్లు
లవ్ స్టోరి చిత్రం 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా క్షీణించాయి. తుఫాన్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో ఈ సినిమా కలెక్షన్లు అంతగా పుంజుకోలేకపోయాయి. 5వ రోజున ఈ చిత్రం నైజాంలో 64 లక్షలు, సీడెడ్‌లో 19 లక్షలు, ఉత్తరాంధ్రలో 14 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 9 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 లక్షలు, గుంటూరులో రూ.4 లక్షలు, కృష్ణా జిల్లాలో 7 లక్షలు, నెల్లూరులో 4 లక్షలు వసూలు చేశాయి. దాంతో ఐదో రోజు రూ.1.26 కోట్ల నికర వసూళ్లు, రూ.2.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఐదు రోజుల్లో
ఇక ఐదు రోజుల మొత్తం కలెక్షన్లు చూసుకొంటే.. తొలి రోజున రూ.7 కోట్లకుపైగా, రెండో రోజు రూ.5 కోట్లకుపైగా, మూడో రోజున 5 కోట్లకుపైగా, నాలుగో రోజు రూ.2.5 కోట్లకుపైగా, ఐదో రోజు రూ.1.25 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం రూ.21.18 కోట్లు నికరంగా, రూ.34..38 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది.

అమెరికాలో జాతిరత్నాలను అధిగమించి...
అమెరికాలో లవ్ స్టోరి చిత్రం రిలీజైన తొలి ఆట నుంచే వసూళ్లపరంగా ప్రభంజనం సృష్టించింది. ప్రీమియర్ల ద్వారా $313,915, మొదటి రోజు $291,890, రెండో రోజు $287,785, మూడో రోజు $128,365, నాలుగో రోజు, ఐదో రోజు ముగిసే సమయానికి $1,021,955 అంటే సుమారు 7.54 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో జాతిరత్నాలు చిత్రం వసూలు చేసిన రికార్డును లవ్ స్టోరి తిరగరాసిందని చెప్పుకొంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఇలా..
ఇక లవ్ స్టోరి సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వస్తే.. నైజాంలో రూ.10.08 కోట్లు, సీడెడ్‌లో రూ.3.32 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.35 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.29 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.09 కోట్లు, గుంటూరులో రూ.1.29 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.08 కోట్లు, నెల్లూరులో రూ.68 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.1.18 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 7.5 కోట్లకుపైగా వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.26.66 కోట్ల నికర వసూళ్లు, రూ.46.80 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
Recommended Video

లవ్ స్టోరి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..
లవ్ స్టోరి చిత్రం తొలి వారాంతపు కలెక్షన్లను చూస్తే సునాయసంగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందనే విషయం స్పష్టమైంది. అయితే అనుకోకుండా గులాబ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేయడంతో కలెక్షన్లు దారుణంగా క్షీణించాయి. అయితే నిలకడగానే వసూలు రాబట్టం కొంత ఉపశమనం కలిగించే విషయంగా మారింది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు ప్రపంచవ్యాప్తంగా రూ.31.2 కోట్ల మేర బిజినెస్ చేసింది. ప్రస్తుతం రూ.26.66 కోట్లు రాబట్టింది. అయితే ఇంకా ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే సుమారు 3.5 కోట్ల మేర వసూలు చేయాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











