twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Love Story day 6 collections దారుణంగా క్షీణించిన వసూళ్లు.. కనీసం లాభాల్లోకి సాధిస్తుందా?

    |

    గులాబ్ తుఫాన్ కొట్టిన దెబ్బకు లవ్ స్టోరి సినిమా బాక్సాఫీస్ వద్ద కోలుకోలేకపోయింది. భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న లవ్ స్టోరి చిత్రానికి గులాబ్ అడ్డంకిగా నిలిచింది. ఓ దశలో రికార్డుస్థాయి లాభాలు సాధిస్తుందనుకొన్న ఈ చిత్రం వసూళ్లపరంగా చతికిలపడింది. అయితే 6వ రోజు కూడా ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా క్షీణించడం ఫ్యాన్స్‌కు, డిస్టిబ్యూటర్లకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇక 6వ రోజు లవ్ స్టోరి కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

     లవ్ స్టోరి 6వ రోజున ఎంతంటే

    లవ్ స్టోరి 6వ రోజున ఎంతంటే

    తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టోరి చిత్రం ఆరో రోజున నైజాంలో 32 లక్షలు, సీడెడ్‌లో 14 లక్షలు, ఉత్తరాంధ్రలో 8 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.4 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.3 లక్షలు, గుంటూరు జిల్లాలో 1.2 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.3 లక్షలు, నెల్లూరులో రూ.1 లక్ష వసూలు చేసింది. దాంతో ఏపీ, నైజాంలో రూ.66 లక్షలు నెట్, 1.05 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

     తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల కలెక్షన్లు

    లవ్ స్టోరి చిత్రం మొత్తంగా గత ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ.10.40 కోట్లు, సీడెడ్‌లో రూ.3.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.43 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.1.33 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 1.12 కోట్లు, గుంటూరులో రూ.1.30 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.11 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.69 కోట్లు వసూలు చేసింది.

    తెలుగు రాష్ట్రాల్లో ఎంత సాధించిందంటే..

    తెలుగు రాష్ట్రాల్లో ఎంత సాధించిందంటే..

    లవ్ స్టోరికి సంబంధించి గత ఆరు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున రూ.7.15 కోట్లు, రెండో రోజున రూ.5.08 కోట్లు, మూడో రోజున రూ.5.19 కోట్లు, నాలుగో రోజున రూ.2.52 కోట్లు, ఐదో రోజున రూ.1.26 కోట్లు, ఆరో రోజున 66 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో రూ.21.84 కోట్లు నికరంగా, రూ.35.43 కోట్లు స్థూలంగా రాబట్టింది.

    మిగితా రాష్ట్రాల్లో ఎంతంటే?

    మిగితా రాష్ట్రాల్లో ఎంతంటే?

    లవ్ స్టోరి చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగితా రాష్ట్రాల్లో కూడా జోరుగానే వసూళ్లను రాబట్టింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలలో ఈ చిత్రం రూ.1.20 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం సుమారు రూ.7 కోట్లకుపైగా రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. లాక్ డౌన్ తర్వాత ఇతర రాష్ట్రాల్లో భారీ వసూళ్లను నమోదు చేసిన చిత్రంగా లవ్ స్టోరి ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.

    Recommended Video

    Love Story Movie Success Meet | Naga Chaitanya | Sai Pallavi
    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు..

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు..

    దీంతో లవ్ స్టోరి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.27.42 కోట్లు నికరంగా, రూ.48.10 కోట్లు స్థూలంగా కలెక్షన్లను నమోదు చేసింది. ఇక రిలీజ్‌కు ముందు ఈ చిత్రం రూ.31 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. డిస్టిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. రూ.32 కోట్లకుపైగా రాబట్టాల్సి ఉంటుంది. అంటే ఇంకా ఈ చిత్రం సుమారు రూ.4.5 కోట్లు సాధిస్తే.. బ్రేక్ ఈవెన్ జోన్‌లోకి వస్తుంది. చాలా ఫాస్ట్‌గా లాభాల్లోకి వస్తుందనుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం ఫ్రాఫిట్ జోన్‌లోకి రావడానికి కష్టాలు పడుతున్నట్టు కనిపిస్తున్నది.

    English summary
    Sai Pallavi and Naga Chaitanya's Love Story movie released on September 24th worldwide. Love Story is getting good collections at Worldwide. Here is the 6 days collections are..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X