Love Story US day 1 collections.. వకీల్‌సాబ్ రికార్డును తుడిచిపెట్టిన లవ్ స్టోరి..
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో సాయి పల్లవి, నాగచైతన్య జంటగా నటించిన లవ్ స్టోరి చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. లాక్‌డౌన్ తర్వాత అమెరికాలో భారీ వసూళ్లను నమోదు చేసిన చిత్రంగా ఈ చిత్రం ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. లాక్‌డౌన్ కారణంగా ప్రపంచ సినిమా సంక్షోభం కూరుకపోయిన తరుణంలో లవ్ స్టోరి చిత్రం విడుదలైన అన్ని దేశాల్లో భారీ వసూళ్లను దక్కించుకొంటున్నది. ఈ సినిమాకు సంబంధించిన బాక్సాఫీస్ రిపోర్ట్ ఏమిటంటే..

లవ్ స్టోరి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్
లవ్ స్టోరి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఏపీ, తెలంగాణలో మొత్తంగా 26.3 కోట్లు బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.2.10 కోట్ల మేర బిజినెస్ నమోదైంది. ఇక ఓవర్సీస్‌లో రూ.2.8 కోట్ల మేర జరిగింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 31.2 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో ఈ చిత్రం 32 కోట్ల రూపాయల లక్ష్యంగా బరిలోకి దిగింది.

ప్రపంచవ్యాప్తంగా 1000కిపైగా థియేటర్లలో
సెకండ్ వేవ్ కరోనా వైరస్ పరిస్థితుల తర్వాత థియేటర్లలో భారీగా రిలీజైన చిత్రం లవ్ స్టోరి. ఫిదా తర్వాత సాయిపల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పండింది. దాంతో ఈ సినిమాకు డిమాండ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా 1000కిపైగా థియేటర్లలో రిలీజ్ కాగా, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 700కుపైగా థియేటర్లలో రిలీజ్ అయింది. సెకండ్ లాక్‌డౌన్ తర్వాత ఈ రేంజ్‌లో విడుదలైన తొలి సినిమా లవ్ స్టోరి కావడం గమనార్హం.

అమెరికా ప్రీమియర్‌కు రికార్డు కలెక్షన్లు
లవ్ స్టోరి సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు భారతీయ కాలమానం ప్రకారం గురువారం రాత్రి (సెప్టెంబర్ 23వ తేదీ) అమెరికాలో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ల కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉండటం గమనార్హం. తాజా సమాచారం ప్రకారం తొలి రోజున ఈ చిత్రం 226 లొకేషన్లలో 306.795 అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. ఇటీవల కాలంలో తెలుగు సినిమాకు సంబంధించి ఇవే అత్యుత్తమ వసూళ్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

వకీల్ సాబ్ రికార్డును అధిగమించిన లవ్ స్టోరి
అమెరికాలో ప్రీమియర్ షోల కలెక్షన్లను పరిశీలిస్తే.. ఇటీవల విడుదలైన పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ రికార్డును అధిగమించింది. వకీల్ సాబ్ చిత్రం అమెరికా వ్యాప్తంగా 228 లొకేషన్లలో విడుదలై 300,557 అమెరికన్ డాలర్లు వసూలు చేస్తే లవ్ స్టోరి ఆ మొత్తానికి కంటే ఎక్కువగా వసూలు చేయడం విశేసంగా మారింది.

2021లో నంబర్ వన్ చిత్రంగా
ఇక 2021 సంవత్సరంలో విడుదలైన చిత్రాలతో పోల్చుకొంటే లవ్ స్టోరి చిత్రం టాప్ లేపింది. వకీల్ సాబ్ 301k డాలర్లు, జాతి రత్నాలు 123k డాలర్లు, మాస్టర్ చిత్రం 96K డాలర్లు, రంగ్ దే చిత్రం 57K డాలర్లు వసూలు చేసింది. అయితే లవ్ స్టోరి చిత్రం ఈ చిత్రాలకంటే ఎక్కువగా 306K అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. అమరికాలో ప్రదర్శించిన ప్రీమియర్ల గ్రాండ్‌గా వసూళ్లు సాధించి టాప్ 5 చిత్రాల్లో నంబర్‌వన్‌గా నిలిచింది.

తొలి రోజు రూ.10 కోట్ల మేర వసూళ్ల అంచనా
ఇక నైజాం, ఆంధ్రా, సీడెడ్‌తో పాటు ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌తోపాటు అన్ని ప్రదేశాల్లో భారీ వసూళ్లు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక వసూళ్లను సాధించే చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్నది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్ల మేరకు వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











