Love Story Closing Collections: బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చినా షాకింగ్‌గా కలెక్షన్లు.. ఇంతకు లాభమా? నష్టమా?

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటించిన లవ్ స్టోరి చిత్రం ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజై భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా ఓ ఘనతను సంపాదించింది. రిలీజైన తొలి రెండు, మూడు రోజుల్లో భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఆ తర్వాత లవ్ స్టోరి కలెక్షన్లు పుంజుకొన్న దాఖలాలు కనిపించలేదు. అయితే 18 రోజుల తర్వాత లవ్ స్టోరి క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఈ సినిమా లాభాల్లోకి వచ్చిందా అంటే..

 లవ్ స్టోరిపై తుఫాన్ దెబ్బ

లవ్ స్టోరిపై తుఫాన్ దెబ్బ

లవ్ స్టోరి సినిమా కలెక్షన్లు తొలి ఆట నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే మూడు రోజులు భారీగా వసూళ్లను నమోదు చేస్తూ రికార్డు వసూళ్ల దిశగా ప్రయాణి చేసినట్టు కనిపించింది. అయితే గులాబ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేయడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. ఆ తర్వాత కలెక్షన్లు పుంజుకొన్నట్టు దాఖలాలు లేవు. ఈ సినిమా కలెక్షన్లను తుఫాన్ పరిస్థితులు దారుణంగా దెబ్బ తీశాయి.

31 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్

31 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్

లవ్ స్టోరి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో రూ.10 కోట్లకు, ఆంధ్రాలో 16 కోట్లకుపైగా రూపాయలతో థియేట్రికల్ హక్కుల రూపంలో సంపాదించింది. కర్ణాటక ఇతర రాష్ట్రాల హక్కులు రూ.2.10 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ.2.8 కోట్లకు అమ్ముడు పోయాయి. మొత్తంగా ఈ సినిమా బిజినెస్ ఓవరాల్‌గా, ప్రపంచవ్యాప్తంగా రూ.31 కోట్లకుపైగా నమోదైంది. దాంతో ఈ సినిమా సుమారు రూ.32 కోట్ల షేర్ లక్ష్యంగా బాక్సాఫీస్ ప్రయాణం మొదలైంది.

లవ్ స్టోరి సినిమా రోజువారీ వసూళ్లు

లవ్ స్టోరి సినిమా రోజువారీ వసూళ్లు

లవ్ స్టోరి సినిమా కలెక్షన్లు రోజు వారీగా ఇలా ఉన్నాయి..

తొలి రోజున రూ.7.13 కోట్లు
2వ రోజున రూ.5.08 కోట్లు
3వ రోజున రూ.5.19 కోట్లు
4వ రోజున రూ.2.52 కోట్లు
5వ రోజున రూ.1.26 కోట్లు
6వ రోజున రూ. 66 లక్షలు
7వ రోజున రూ. 39 లక్షలు
8వ రోజున రూ. 49 లక్షలు
9వ రోజున రూ. 96 లక్షలు
10వ రోజున రూ.1.10 కోట్లు
11వ రోజున రూ.28 లక్షలు
12వ రోజున రూ.23 లక్షలు
13వ రోజున రూ.18 లక్షలు
14వ రోజున రూ.15 లక్షలు
15వ రోజున రూ.10 లక్షలు
16వ రోజున రూ.17 లక్షలు
17వ రోజున రూ. 46 లక్షలు
18వ రోజున రూ.30 లక్షలు

తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టోరి కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టోరి కలెక్షన్లు

గత 18 రోజుల్లో లవ్ స్టోరి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా కలెక్ష్=న్లను నమోదు చేసింది. నైజాంలో రూ.12.50 కోట్లు, సీడెడ్‌లో రూ.4.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.65 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.40 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.1.52 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.38 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.92 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 28 కోట్లకుపైగా షేర్, సుమారు రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Recommended Video

Love Story Movie Team Interview | Naga Chaithanya, Sekhar | Easwari Rao
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రిపోర్టు

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రిపోర్టు

ఇక మిగితా రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే.. కర్ణాటకలో రూ.2.25 కోట్లు సాధించింది. అలాగే ఓవర్సీస్‌లో రూ.7 కోట్ల వరకు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో రూ. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్లు షేర్, సుమారు రూ.60 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం స్వల్ప లాభాలతో తన జర్నీని బాక్సాఫీస్ వద్ద ముగించే ప్రయత్నం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X