Love Story Re Release Collections: లవ్ స్టోరీ రీ రిలీజ్ కలెక్షన్లు.. సాయిపల్లవి మూవీకి షాకింగ్‌గా వసూళ్లు!
తెలుగు స్టార్ హీరో, హీరోయిన్లు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరి. ప్రముఖ దర్శకుడు శేఖర కమ్ముల రూపొందించిన ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు నారాయణ దాస్ కే నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. 2021 సెప్టెంబర్ 24వ తేదీన గ్రాండ్‌గా రిలీజై ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొన్నది.
ఈ మూవీ సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతం అందించారు. విజయ్ సీ కుమార్ సినిమాటోగ్రఫిని, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. ఇలాంటి విశేషాలు ఉన్న ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ, 2026న మరోసారి రిలీజ్ చేశారు. ఈ సినిమా రీ రీలీజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా, మానవ సంబంధాలు, బాలలపై లైంగిక దాడుల నేపథ్యంగా ఈ సినిమాను భారీగా నిర్మించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 30 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాలోని పాటలు, డ్యాన్సులు, సాయిపల్లవి, నాగచైతన్య పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో పాజిటివ్ జర్నీని బాక్సాఫీస్ వద్ద కొనసాగించింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 40 కోట్ల నెట్, 95 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగులో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సమయంలో లవ్ స్టోరీ సినిమాను భారీగా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఆంధ్ర, నైజాం, కర్ణాటక, తమిళనాడులో రిలీజ్ చేశారు. దాదాపు 50 సిటీలలో 93 లొకేషన్లలో 100కు పైగా స్క్రీన్లలో సుమారుగా 175 షోలు ప్రదర్శించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఈ సినిమా రీ రిలీజ్ విషయంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాకు ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమా నుంచి భారీగా పోటీ ఏర్పడింది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా కలెక్షన్లు సాధించలేకపోయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
లవ్ స్టోరీ సినిమా గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ చిత్రం 20 లక్షల గ్రాస్, రెండో రోజు 10 లక్షల గ్రాస్ వసూలు చేసింది. గత రెండు రోజుల్లో 30 లక్షల రూపాయలు మేర రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మూడో రోజు సుమారుగా 7 నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











