Love Story US collections: అమెరికా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత.. మరో రికార్డుకు చేరువలో లవ్ స్టోరి
టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరి మూవీకి ఓవర్సీస్‌లో ప్రధానంగా అమెరికా బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన వ్యక్తం అవుతున్నది. తొలి రోజే అంటే గురువారం ప్రీమియర్ల రూపంలో రికార్డు వసూళ్లను రాబట్టిన ఈచిత్రం రెండో రోజు (శుక్రవారం) కూడా భారీ కలెక్షన్లను నమోదు చేసింది. అయితే ఈ వారాంతంలో మరో మైలురాయిని అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

తొలి రోజే 306k డాలర్లు
లవ్ స్టోరి మూవీకి రిలీజ్‌కు ముందే భారీ హైప్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్ జోరుగా జరిగింది. దాంతో తొలి రోజు ప్రీమియర్ల ద్వారా రికార్డు కలెక్షన్లు నమోదయ్యాయి. ప్రీమియర్ల ద్వారా 306k అమెరికన్ డాలర్లు వసూలయ్యాయి. రెండు లాక్‌డౌన్ల తర్వాత ఈ రేంజ్‌లో కలెక్షన్లు రావడం రికార్డుగా మారింది. ఇటీవల సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌కు ముందు విడుదలైన వకీల్ సాబ్ కంటే ఎక్కువగా వసూళ్లు రాబట్టడం విశేషంగా మారింది.

రెండో రోజు అదే జోష్
ఇక శుక్రవారం రోజున కూడా లవ్ స్టోరి చిత్రం భారీగా వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు ప్రీమియర్ల తర్వాత ఏ మాత్రం జోష్ తగ్గకుండా రెండు రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టింది. రెండో రోజున సమారు 290K వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆదరణ స్పష్టంగా కనిపించింది.

రెండు రోజుల్లోనే 500K డాలర్లు
వరుసగా రెండు రోజులు బాక్సాఫీస్‌ను కుమ్మేయడంతో సునాయాసంగా 500K అమెరికన్ డాలర్లను వసూలు చేసింది. రెండో రోజుల్లోనే హాఫ్ మిలియన్ మార్క్‌ను దాటడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ఊపును కొనసాగితే లవ్ స్టోరి కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

వారాంతానికి 1 మిలియన్ క్లబ్బులోకి
లవ్ స్టోరిపై ప్రేక్షకుల నుంచి ఇదే రేంజ్ క్రేజ్ కొనసాగితే.. వారాంతం అంటే.. ఆదివారం నాటికి 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉంటే తొలి వారంలోనే లవ్ స్టోరి బయ్యర్లకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు ఇంతగా సానుకూల వాతావరణం కలిగించిన సినిమా లవ్ స్టోరి కావడం విశేషంగా మారింది.

తొలి వారంలోనే లాభాల్లోకి చేరే అవకాశం
ఇక లవ్ స్టోరి ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. అమెరికాకు సంబంధించిన 1.2 మిలియన్ మేర బిజినెస్ జరిగింది. అయితే తొలి వారంలోనే ఈ చిత్రం బ్రేక్ ఇవెన్ సాధించే అవకాశం కనిపిస్తున్నది. గత కొద్దికాలంగా వినోదానికి దూరమైన ప్రేక్షకులకు లవ్ స్టోరి ఫీల్ అందిస్తున్నదనే రిపోర్ట్స్ వస్తున్నాయి. దాంతో ఈ సినిమా భారీ విజయం వైపు దూసుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది.

దేశంలోనే నంబర్ వన్‌గా లవ్ స్టోరి
ఇక దేశవ్యాప్తంగా ఇటీవల రిలీజైన సినిమాల తొలి రోజు కలెక్షన్లను పరిశీలిస్తే.. లవ్ స్టోరి చిత్రం ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఇండియాలోనే తొలి రోజు లవ్ స్టోరి చిత్రం 10.80 కోట్లు రాబట్టగా, సీటిమార్ 5 కోట్లు, షాంగ్చీ 4.15 కోట్లు, బెల్ బాటమ్ చిత్రం రూ.3.55 కోట్లు వసూలు చేసింది. కరోనావైరస్ కారణంగా గత కొద్ది నెలలుగా ఉత్తరాదిలో సినిమా థియేటర్ల మూసివేత కొనసాగుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











