Love Story : షాకింగ్ ప్రీరిలీజ్ బిజినెస్.. చై కెరీర్లోనే తొలిసారిగా.. ఫుల్ రిపోర్ట్ ఇదే!

కరోనా ప్రభావంతో పలుమార్లు వాయిదా పడిన సినిమాల్లో అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా సినిమా ఎప్పుడో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు కానీ, కరోనా రెండో దశ కారణంగా సాధ్య పడలేదు. అయితే మిగతా సినిమాల వల్లే ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరగగా అదేమీ లేదని చెబుతూ ఈ సినిమాని 24వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం షాకిస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే

సినిమా కోసం ఎదురుచూపులు

సినిమా కోసం ఎదురుచూపులు

అక్కినేని నాగ చైతన్య - టాలెంటెడ్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీ ప్యూర్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా విడుదల కాబోతోంది. 'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన రూపొందించిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీనికి తోడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన పాటలు ఆకట్టుకోవడం, టీజర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంతో అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. ఫలితంగా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎప్పుడో సినిమా సిద్ధమైనా

ఎప్పుడో సినిమా సిద్ధమైనా

వాస్తవానికి 'లవ్ స్టోరీ' మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించి రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసుకుంది. కానీ, కరోనా మహమ్మారి విజృంభించడంతో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు దర్శక నిర్మాతలు.

'లవ్ స్టోరీ' మూవీని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్లు ముందు ప్రకటించారు. అయితే, అనుకోని పరిస్థితుల్లో టక్ జగదీశ్ పోటీ పడడంతో అది సాధ్యం కాలేదు. దీంతో యూనిట్ ఈ మూవీని మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. అలా ఎన్నో ఆటంకాల తర్వాత ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే

ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగానే చేశారు, మొన్న చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి, అమీర్ ఖాన్ సందడి చేశారు. ఇక సినిమా మీద ఉన్న అంచనాలతో ఊహించని రేంజ్‌లో బిజినెస్‌ జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం ఫిలిం నగర్‌ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు 'లవ్‌స్టోరి' సినిమా వరల్డ్‌వైడ్ 32.8 కోట్ల రూపాయాల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

బ్లాక్‌బస్టర్ ఆడియోతో ఈ సినిమా ప్రేక్షకులలో చాలా హైప్ మరియు ఇంట్రెస్ట్‌ను పెంచింది. ఆంధ్ర హక్కులు 16.8 కోట్ల రూపాయలకు సేల్ అయ్యాయని తెలుస్తోంది. శేఖర్‌ కమ్ముల సినిమాలకు ఉండే డిమాండ్ దృష్ట్యా ఓవర్‌సీస్‌లోనూ సినిమాకు సూపర్ బిజినెస్ చేసిందని ఓవర్‌సీస్‌ హక్కులు నాలుగ కోట్లకు పైగా సేల్ అయిందని అంటున్నారు.

 నైజాంలో వాళ్ళే

నైజాంలో వాళ్ళే

ఈ సినిమా నిర్మాణంలో భాగమైన ఏషియన్‌ సినిమాస్‌ సునీల్ నారంగ్‌ కు నైజాంలో సొంత‌ డిస్ట్రిబ్యూషన్‌ ఉంది కాబట్టి నైజాం ఏరియాలో వాళ్లే సొంతంగా‌ రిలీజ్‌ చేసుకుంటారు. ఒక్క నైజాంలోనే 11 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని అంటున్నారు. ఇక మిగతా శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్ అన్నీ కలిపి దాదాపు 50 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నడిచిందని అంటున్నారు. దీంతో నాగ చైతన్య, సాయి పల్లవి 'లవ్ స్టోరీ'పై ట్రేడ్ వర్గాలు ఏ రేంజ్ నమ్మకం పెట్టుకున్నాయనేది అర్థం చేసుకోవచ్చు.

Recommended Video

Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
చైతూ కెరీర్లోనే తొలిసారిగా

చైతూ కెరీర్లోనే తొలిసారిగా

ఈ 'లవ్ ‌స్టోరి' సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాసు నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి అంశం సినిమాపై అంచనాలు పెంచేయడంతో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ చైతు కెరీర్ లోనే హైయెస్ట్ అని అంటున్నారు. నాగచైతన్య కెరీర్‌లో బెస్ట్‌ మూవీగా ఇది నిలుస్తుందని ట్రేడ్‌ వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X