Love Today Collections: లవ్ టుడేకు సగం కలెక్షన్లు డౌన్.. అయినా అన్ని కోట్ల లాభాలతో సంచలనం
కొత్త తరహా కాన్సెప్టులతో వచ్చే చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ అదిరిపోయే స్పందన వస్తూనే ఉంటుంది. ఇలా ఈ మధ్య కాలంలోనే ఎన్నో సినిమాలు వచ్చాయి. అవన్నీ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో వచ్చిన మూవీనే 'లవ్ టుడే'. ప్రస్తుత తరం ఎదుర్కొంటోన్న కొన్ని విచిత్రమైన సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా.. తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'లవ్ టుడే' మూవీ 11 రోజుల్లో ఎంత రాబట్టింది? లాభం ఎంత సాధించింది? చూద్దామా!

లవ్ టుడే అంటూ వచ్చారు
కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన చిత్రమే 'లవ్ టుడే'. ఈ మూవీని అఘోరం, గణేష్, సురేష్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం అందించారు. సత్యరాజ్, యోగిబాబు, రాధిక శరత్ కుమార్‌లు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు.

లవ్ టుడే బిజినెస్ డీటేల్స్
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'లవ్ టుడే' తమిళంలో మంచి ఆదరణను అందుకుని విజయం సాధించింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు డబ్బింగ్ థియేట్రికల్ రైట్స్‌ను టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ. 2.70 కోట్లకు కొనుగోలు చేశారు. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఆయన అత్యధిక థియేటర్లలో తీసుకొచ్చారు.

11వ రోజు ఎంత వచ్చింది?
తమిళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో 'లవ్ టుడే' మూవీ దక్షిణాది మొత్తంలో వార్తల్లో నిలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీన్ని దిల్ రాజు విడుదల చేశారు. అనుకున్నట్లుగానే దీనికి వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇదే రెండో వారంలోనూ కంటిన్యూ అవుతోంది. అయితే, 11వ రోజు దీనికి రూ. 38 లక్షలు గ్రాస్, రూ. 20 లక్షలకు పైగా షేర్ వచ్చింది.

11 రోజులకు ఎంతొచ్చింది?
విభిన్నమైన సబ్జెక్టుతో వచ్చిన 'లవ్ టుడే' మూవీకి కలెక్షన్లు మంచిగా వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో భారీగా రాణించింది. ఏరియాల పరంగా చూస్తే.. ఇది ఇప్పటి వరకూ నైజాంలో రూ. 6.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 5.48 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 11 రోజుల్లో రూ. 13.13 కోట్లు గ్రాస్, రూ. 6.78 కోట్లు షేర్‌ను రాబట్టింది.

మూవీకి అన్ని కోట్ల లాభాలు
యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో వచ్చిన 'లవ్ టుడే' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.70 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 11 రోజుల్లో రూ. 6.78 కోట్లు వసూలు చేసింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.78 కోట్లు లాభాలను కూడా ఇది అందుకుంది.

మరో 22 లక్షలు రాబడితే..
తమిళంలో రూపొంది భారీ హిట్ అయిన 'లవ్ టుడే' మూవీని నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేశారు. దీనికి ఇక్కడ భారీ వసూళ్లు వస్తున్నాయి. ఫలితంగా ఇది మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు రూ. 22 లక్షలు షేర్ వసూలు అయితే.. 7 కోట్ల షేర్ మార్కును చేరడంతో పాటు 4 కోట్లు లాభాలను చేరుతుంది.


Click it and Unblock the Notifications











