Love Today Collections: 3 కోట్ల టార్గెట్.. వారంలోనే సంచలనం.. దిల్ రాజుకు లాభం ఎన్ని కోట్లు అంటే!

ఇండియా మొత్తంలోనే ఇప్పుడు తెలుగు మార్కెట్ చాలా పెద్దది అన్న విషయం తెలిసిందే. అందుకే చాలా భాషల్లో వచ్చే చిత్రాలను మన భాషలోకి డబ్బింగ్ చేసి క్యాష్ చేసుకోవాలని ఫిల్మ్ మేకర్లు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా సౌతిండియాలో వచ్చే చాలా చిత్రాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇలా తమిళంలో సూపర్ హిట్ అయిన 'లవ్ టుడే' మూవీని కూడా ఇటీవలే మన దగ్గర విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని సత్తా చాటుకుంది. ఈ నేపథ్యంలో 'లవ్ టుడే' మూవీ వారం రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

ఈరోజుల్లో లవ్ కాన్సెప్టుతోనే

ఈరోజుల్లో లవ్ కాన్సెప్టుతోనే


కోలీవుడ్‌కు చెందిన ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన చిత్రమే 'లవ్ టుడే'. ఈ మూవీని అఘోరం, గణేష్, సురేష్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం అందించారు. సత్యరాజ్, యోగిబాబు, రాధిక శరత్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు చేశారు.

లవ్ టుడే బిజినెస్ డీటేల్స్

లవ్ టుడే బిజినెస్ డీటేల్స్


యూత్‌ఫుల్ లవ్ కాన్సెప్టుతో రూపొందిన 'లవ్ టుడే' తమిళంలో మంచి ఆదరణను అందుకుని విజయం సాధించింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు డబ్బింగ్ థియేట్రికల్ రైట్స్‌ను టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ. 2.70 కోట్లకు కొనుగోలు చేశారు. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఆయన అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు.

7వ రోజు ఎంత వచ్చింది?

7వ రోజు ఎంత వచ్చింది?

'లవ్ టుడే' మూవీకి మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో దీనికి తొలి రోజు రూ. 2.22 కోట్లు గ్రాస్, 2వ రోజు రూ. 2.35 కోట్లు గ్రాస్, 3వ రోజు రూ. 2.38 కోట్లు గ్రాస్, 4వ రోజు రూ. 1.15 కోట్లు, 5వ రోజు రూ. 98 లక్షలు, 6వ రోజు 85 లక్షలు గ్రాస్‌ వచ్చింది. ఈ క్రమంలోనే 7వ రోజు ఈ మూవీకి రూ. 72 లక్షలు గ్రాస్‌తో పాటు రూ. 35 లక్షలకు పైగా షేర్ వచ్చింది.

7 రోజులకు ఎంతొచ్చింది?

7 రోజులకు ఎంతొచ్చింది?


క్రేజీ స్టోరీతో రూపొందిన 'లవ్ టుడే' మూవీకి కలెక్షన్లు మంచిగా వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో చక్కగా రాణించింది. ఏరియాల పరంగా చూస్తే.. ఇది ఇప్పటి వరకూ నైజాంలో రూ. 5.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.02 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.53 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 7 రోజుల్లో రూ. 10.65 కోట్లు గ్రాస్, రూ. 5.51 కోట్లు షేర్ వసూలు అయింది.

మూవీకి అన్ని కోట్ల లాభాలు

మూవీకి అన్ని కోట్ల లాభాలు

యూత్‌ఫుల్ కాన్సెప్టుతో వచ్చిన 'లవ్ టుడే' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.70 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారంలో రూ. 5.51 కోట్లు వసూలు చేసింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.51 కోట్లు లాభాలను కూడా ఈ మూవీ అందుకుంది.

ఆ మార్కులు చేరి రికార్డులు

ఆ మార్కులు చేరి రికార్డులు

'లవ్ టుడే' మూవీని నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ఇక్కడ భారీ వసూళ్లు వస్తున్నాయి. ఫలితంగా ఇది మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా రూ. 10 కోట్ల గ్రాస్, రూ. 5 కోట్లు షేర్‌ మార్కులను చేరింది. అలాగే, లాభాలు కూడా 2.50 కోట్లు దాటి రికార్డులు నమోదు చేసింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X