Love Today Collections: లవ్ టుడే ఊచకోత.. 5 రోజుల్లోనే అన్ని కోట్లు.. దిల్ రాజుకు అన్ని కోట్ల లాభం

గతంలో కంటే ఈ మధ్య కాలంలో యూత్‌ఫుల్ లవ్ స్టోరీ మూవీలు చాలా తక్కువగా వస్తున్నాయి. దీంతో ఇలాంటి చిత్రాల కోసం యువ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ నెల మొదట్లో తమిళంలో విడుదలైన ఘన విజయాన్ని అందుకున్న చిత్రం 'లవ్ టుడే'ను తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ హక్కులు తీసుకోవడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'లవ్ టుడే' మూవీ 5 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

లవ్ టుడే అంటూ వచ్చారు

లవ్ టుడే అంటూ వచ్చారు

కోలీవుడ్ యంగ్ గాయ్ ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన సినిమానే 'లవ్ టుడే'. ఈ మూవీని అఘోరం, గణేష్, సురేష్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. సత్యరాజ్, యోగిబాబు, రాధిక శరత్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం అందించారు.

లవ్ టుడే బిజినెస్ డీటేల్స్

లవ్ టుడే బిజినెస్ డీటేల్స్


వేరే భాషల్లో విడుదలై విజయం సాధించిన సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇలా ఇప్పుడు 'లవ్ టుడే' చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ను టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ. 2.70 కోట్లకు కొనుగోలు చేశారు. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఆయన భారీ స్థాయిలో విడుదల చేశారు.

5వ రోజు ఎంత వచ్చింది?

5వ రోజు ఎంత వచ్చింది?


యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో వచ్చిన 'లవ్ టుడే' మూవీకి మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. మొదటి రోజు రూ. 2.22 కోట్లు గ్రాస్, రెండో రోజు రూ. 2.35 కోట్లు గ్రాస్, మూడో రోజు రూ. 2.38 కోట్లు గ్రాస్, నాలుగో రోజు రూ. 1.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఈ క్రమంలోనే ఐదో రోజు కాస్త తగ్గి దీనికి రూ. 98 లక్షలు గ్రాస్‌తో పాటు రూ. 50 లక్షలకు పైగా షేర్ వచ్చింది.

5 రోజులకు ఎంతొచ్చింది?

5 రోజులకు ఎంతొచ్చింది?

క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'లవ్ టుడే' మూవీకి కలెక్షన్లు మంచిగా వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో చక్కగా రానించింది. ఏరియాల పరంగా చూస్తే.. ఇది ఇప్పటి వరకూ నైజాంలో రూ. 4.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 91 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 3.92 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 5 రోజుల్లో రూ. 9.08 కోట్లు గ్రాస్, రూ. 4.70 కోట్లు షేర్ వసూలు అయింది.

మూవీకి అన్ని కోట్ల లాభాలు

మూవీకి అన్ని కోట్ల లాభాలు


వైవిధ్యమైన కథతో వచ్చిన 'లవ్ టుడే' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.70 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 రోజుల్లో రూ. 4.70 కోట్లు వసూలు చేసింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.70 కోట్లు లాభాలను కూడా ఈ మూవీ అందుకుంది.

దిల్ రాజుకు ఫుల్ ప్రాఫిట్

దిల్ రాజుకు ఫుల్ ప్రాఫిట్


తమిళంలో విడుదలై బిగ్ సక్సెస్ అయిన 'లవ్ టుడే' మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ఇక్కడ భారీ వసూళ్లు వస్తున్నాయి. ఫలితంగా ఇది మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. దీంతో దిల్ రాజుకు దాదాపు రూ. 2 కోట్లు వరకూ లాభాలు దక్కాయి. దీంతో ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X