Love Today Collections: లవ్ టుడే అస్సలు తగ్గట్లేదుగా.. 6 రోజుల్లో వచ్చిన ప్రాఫిట్ ఎంతంటే?

రొటీన్ కమర్షియల్ సినిమాలను ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. కొత్త తరహా కంటెంట్ ఉంటేనే ఆడియెన్స్ సినిమాలను చూసేందుకు థియేటర్స్ కు వస్తున్నారు. ఇక రీసెంట్ గా డిఫరెంట్ పాయింట్ తో వచ్చిన యూత్‌ఫుల్ లవ్ స్టోరీ లవ్ టూడే సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందిస్తోంది. ఇక ఈ సినిమా 6వ రోజు కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పటివరకు మొత్తం ఎంత ప్రాఫిట్ అంధించింది అనే వివరాల్లోకి వెళితే..

థియేట్రికల్ రైట్స్‌

థియేట్రికల్ రైట్స్‌

తమిళంలో ఘన విజయం సాధించిన లవ్ టూడే సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకోవడంతో దీనిపై తెలుగులో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. కోమలి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న ప్రదీప్ రంగనాథ్ ఈ సినిమాను తెరపైకి తీసుకు వచ్చాడు. ప్రదీప్ డైరెక్టర్ గానే కాకుండా హీరోగా నటించగా ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. 'లవ్ టుడే' కు సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు రూ. 2.70 కోట్లకు కొనుగోలు చేశారు.

6వ రోజు కలెక్షన్స్

6వ రోజు కలెక్షన్స్

డిఫరెంట్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లవ్ టుడే' సినిమాకి తమిళ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ తెలుగులో కూడా హెల్ప్ అయ్యింది. అందుకే మొదటి రోజు రూ. 2.22 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక 2వ రోజు రూ. 2.35 కోట్లు గ్రాస్, 3వ రోజు రూ. 2.38 కోట్లు గ్రాస్, 4వ రోజు రూ. 1.15 కోట్లు గ్రాస్, 5వ రోజు 98 లక్షలు వసూలు అయింది. ఇక 6వ రోజు కాస్త తగ్గి దీనికి రూ. 85 లక్షలు గ్రాస్‌ వచ్చింది.

6 రోజుల్లో వచ్చిన మొత్తం కలెక్షన్స్

6 రోజుల్లో వచ్చిన మొత్తం కలెక్షన్స్

'లవ్ టుడే' సినిమాకు ఆంద్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్ చూస్తే.. ఇప్పటి వరకూ నైజాంలో రూ. 4.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 97 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 4.26 కోట్లు గ్రాస్‌ దక్కింది. ఇలా 6 రోజుల్లో ఏపీ తెలంగాణలో రూ. 9.93 కోట్లు గ్రాస్, రూ. 5.13 కోట్లు షేర్ వసూలు అయింది.

ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్

ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్

'లవ్ టుడే' సినిమాకు వీకెండ్ బాగానే కలిసి వచ్చింది. సోమవారం నుంచి కూడా డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 2.70 కోట్లు మేర బిజినెస్ చేసింది. మొదట లిమిటెడ్ థియేటర్స్ లో విడుదల చేసిన దిల్ రాజు ఆ తరువాత ఆ సంఖ్యను ఇంకాస్త పెంచాడు. మొత్తంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. లవ్ టూడే సినిమా 6 రోజుల్లో రూ. 5.13 కోట్లు వరకు షేర్ అందుకుంది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.13 కోట్లతో లాభాలతో కొనసాగుతోంది.

ఈ వారం మరింత లాభాలు

ఈ వారం మరింత లాభాలు

నల్ నిర్మాత దిల్ రాజు ఏమాత్రం అవకాశం ఉన్న కూడా సినిమా కలెక్షన్స్ పెరిగే విధంగా ప్రణాళికలు కూడా రచిస్తూ ఉంటారు. అయితే ఈ వారం థియేటర్ల సంఖ్యను మరికొంత పెంచి ప్రమోషన్స్ కూడా పెంచాలని అనుకున్నారు. ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తిచేసుకుంది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాఫిట్స్ వస్తాయని చెప్పవచ్చు.

మొత్తంగా అయితే ఈ సినిమా రెండవ వీకెండ్ కూడా మంచి ప్రాఫిట్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. మరి మొత్తంగా దిల్ రాజుకు ఈ సినిమా ఏ స్థాయిలో ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X