Love Today Collections: లవ్ టుడే కలెక్షన్ల సునామీ.. 9 రోజుల్లోనే అంతలా.. లాభాలతో దిల్ రాజు రికార్డు
గతంలో యూత్‌ఫుల్ లవ్ కాన్సెప్టులతో ఎన్నో రకాల సినిమాలు వచ్చేవి. అలా వచ్చిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో చాలా కాలం పాటు దర్శక నిర్మాతలు అవే తరహా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. ఈ మధ్య కాలంలో మాత్రం అలాంటివి అరకొరగానే వస్తున్నాయి. ఇప్పుడలా వచ్చిన సినిమానే 'లవ్ టుడే'. తమిళంలో రూపొంది తెలుగులోకి డబ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో రెండో వారంలోనూ కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'లవ్ టుడే' మూవీ 9 రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

నేటి లవ్‌ను అద్దం పట్టేలా
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన చిత్రమే 'లవ్ టుడే'. ఈ మూవీని అఘోరం, గణేష్, సురేష్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం అందించారు. సత్యరాజ్, యోగిబాబు, రాధిక శరత్ కుమార్‌లు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

లవ్ టుడే బిజినెస్ డీటేల్స్
ప్రస్తుత జనరేషన్ లవ్ స్టోరీతో రూపొందిన 'లవ్ టుడే' తమిళంలో మంచి ఆదరణను అందుకుని విజయం సాధించింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు డబ్బింగ్ థియేట్రికల్ రైట్స్‌ను టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ. 2.70 కోట్లకు కొనుగోలు చేశారు. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఆయన అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు.

9వ రోజు ఎంత వచ్చింది?
'లవ్ టుడే' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 2.22 కోట్లు గ్రాస్, 2వ రోజు రూ. 2.35 కోట్లు గ్రాస్, 3వ రోజు రూ. 2.38 కోట్లు గ్రాస్, 4వ రోజు రూ. 1.15 కోట్లు, 5వ రోజు రూ. 98 లక్షలు, 6వ రోజు 85 లక్షలు, 7వ రోజు రూ. 72 లక్షలు గ్రాస్, 8వ రోజు రూ. 58 లక్షలు గ్రాస్ వచ్చింది. ఈ క్రమంలోనే 9వ రోజు ఈ మూవీకి రూ. 77 లక్షలు గ్రాస్‌తో పాటు రూ. 40 లక్షలకు పైగా షేర్ వచ్చింది.

9 రోజులకు ఎంతొచ్చింది?
క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'లవ్ టుడే' మూవీకి కలెక్షన్లు మంచిగా వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో చక్కగా రాణించింది. ఏరియాల పరంగా చూస్తే.. ఇది ఇప్పటి వరకూ నైజాంలో రూ. 5.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.14 కోట్లు, ఆంధ్రాలో రూ. 5.06 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 9 రోజుల్లో రూ. 12.00 కోట్లు గ్రాస్, రూ. 6.20 కోట్లు షేర్‌ను వసూలు అయింది.

మూవీకి అన్ని కోట్ల లాభాలు
విభిన్నమైన ప్రయోగంగా వచ్చిన 'లవ్ టుడే' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.70 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 9 రోజుల్లో రూ. 6.20 కోట్లు వసూలు చేసింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.20 కోట్లు లాభాలను కూడా ఈ మూవీ అందుకుంది.

అన్ని కోట్లతో అదిరే రికార్డు
కోలీవుడ్‌లో హిట్ అయిన 'లవ్ టుడే' మూవీని నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ఇక్కడ భారీ వసూళ్లు వస్తున్నాయి. ఫలితంగా ఇది మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా రూ. 12 కోట్ల గ్రాస్, రూ. 6 కోట్లు షేర్‌ను దాటింది. అలాగే, లాభాలు కూడా 3 కోట్లు దాటి రికార్డులు సాధించింది.


Click it and Unblock the Notifications











