Lover Collections షాకింగ్‌గా లవర్ మూవీ కలెక్షన్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన లవర్ సినిమా సినీ విమర్శకుల నుంచి భారీ అప్రిషియేషన్ అందుకొన్నది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్లో అండ్ స్టడీగా వసూళ్లను రాబడుతున్నది. తమిళ హీరో మణికందన్, తెలుగు యువ హీరోయిన్ శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 9న తమిళంలో, ఫిబ్రవరి 10న తెలుగులో రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందించిన లవర్ చిత్రం అన్ని ఖర్చులు కలుపుకొని సుమారుగా 8 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను ప్రీ రిలీజ్ బిజినెస్‌ను తమిళంలో 6 కోట్లుగా, తెలుగులో కోటి రూపాయలుగా వాల్యూ కట్టారు. ఇక ఈ మూవీని ఇండియాలో 500 స్క్రీన్లు, ఓవర్సస్‌లో 100 స్క్రీన్లలో కలిపి మొత్తంగా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

తమిళంలో లవర్ చిత్రం ఓ మాదిరిగా వసూళ్లను సాధించింది. తొలి రోజు 70 లక్షల నికర వసూళ్లను 1.4 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు టాక్ స్పెడ్ కావడంతో తొలి రోజు కంటే 2వ రోజు కలెక్షన్లు పెరిగాయి. ఈ సినిమా రెండో రోజు 1.2 కోట్ల నికర కలెక్షన్లు, 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో రెండు రోజుల్లో 3.4 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
మిలియన్ డాలర్ స్టూడియోస్‌పై ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన లవర్ సినిమాకు ప్రభు రామ్ వ్యాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు 3వ రోజు 40 శాతం ఆక్యుపెన్సీ తమిళంలో, తెలుగులో 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో మూవీ గత రెండు రోజులతో పోల్చుకొంటే స్డడీగానే కలెక్షన్లను సాధించింది.

ఇక లవర్ చిత్రం మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. 1 కోటి రూపాయల నికర వసూల్లు, 1.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 5 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది. రానున్న రోజుల్లో భారీ వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











