Lucky Baskhar Business: 100 కోట్ల బడ్జెట్.. దుల్కర్ మూవీ లాభాల్లోకి రావాలంటే? బ్రేక్ ఈవెన్ ఎన్ని కోట్లంటే?

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, మిస్ ఇండియా మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై పాపులర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీ తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్నది. ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

లక్కీ భాస్కర్ సినిమా కథ విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన భాస్కర్ బ్యాంకర్‌గా పనిచేస్తుంటాడు. 5 వేల జీతంతో నెగ్గుకు రాలేని పరిస్థితుల్లో తన వ్యాపారాన్ని మార్చేస్తాడు. అలా ఆయన కొద్దికాలంలోనే కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అయితే ఆ క్రమంలో ఆయన ఎలాంటి అడ్డదార్లు తొక్కాడు? ఆయన సంపాదనను భార్య సుమతి (మీనాక్షి చౌదరీ) ఎందుకు వద్దనుకొన్నది అనేది సంక్షిప్తంగా సినిమా కథ.

Lucky Baskhar Pre release Business WorldWide Here is break even Target of Dulquer Salman Movie

లక్కీ భాస్కర్ మూవీ కంటెంట్ పరంగానే కాకుండా బిజినెస్ పరంగా కూడా భారీగా తెరకెక్కింది. 80, 90వ దశకంలో సాగే కథ కాబట్టి పీరియాడిక్ నేచర్ ఉన్న సినిమాకు ఆర్ట్ వర్క్, ఇతర సాంకేతిక నిపుణుల భాగస్వామ్యం అత్యంత కీలకంగా మారింది. ఆర్టిస్టుల, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. లక్కీ భాస్కర్ మూవీని సుమారుగా 100 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ మూవీని సుమారుగా 1100 స్క్రీన్లలో ఇండియాలో, 1500 స్క్రీన్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 35 కోట్ల షేర్.. 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇక ప్రాంతాలా వారిగా ఈ సినిమా బిజినెస్ వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ భారీగా బిజినెస్ చేసింది. నైజాం థియేట్రికల్ రైట్స్‌ను 6 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగింది. ఆంధ్రాలో హక్కులు 6.8 కోట్ల రూపాయలు, సీడెడ్ సుమారుగా 2.2 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల హక్కులు సుమారుగా 15 కోట్ల రూపాయల మేర బిజినెస్ నమోదైంది.

Lucky Baskhar Pre release Business WorldWide Here is break even Target of Dulquer Salman Movie

ఇక కర్ణాటక హక్కులు 2 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 2 కోట్ల రూపాయలు, కేరళ హక్కులు 3 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్‌ దాదాపు 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ దాదాపు 35 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X