Lucky Bhaskar Day 1 Collection : క్లాస్‌గా కుమ్మేస్తోన్న దుల్కర్ .. లక్కీ భాస్కర్‌కు ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడిగా సినీరంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ తండ్రి బాటలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు. కేవలం మలయాళ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్.. మహానటితో బాగా దగ్గరయ్యారు. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామంతో తెలుగునాట దుల్కర్ సల్మాన్ ఫ్యాన్ బేస్ పీక్స్‌కి చేరింది. తాజాగా ఆయన నటించిన మూవీ లక్కీ భాస్కర్.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజైన ఈ సినిమా తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లు రాబడుతుందోనని ట్రేడ్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై పాపులర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ తదితరులు కీలకపాత్ర పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

దుల్కర్ సల్మాన్ గత సినిమాలు క్లీన్ హిట్ కావడంతో పాటు యువతలో ఆయనకున్న పాపులారిటీ దృష్ట్యా లక్కీ భాస్కర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 15 కోట్ల మేర బిజినెస్ చేసిందని ప్రచారం జరుగుతోంది. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషన్ కార్యక్రమాలు, ఇతర ఖర్చులు కలుపుకుని లక్కీ భాస్కర్ మూవీని రూ. 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీని సుమారుగా 1100 స్క్రీన్లలో ఇండియాలో, 1500 స్క్రీన్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. లక్కీ భాస్కర్ బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే కనీసం రూ.35 కోట్ల షేర్.. రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
లక్కీ భాస్కర్ సినిమా కథ విషయానికి వస్తే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన భాస్కర్ బ్యాంకర్‌గా పనిచేస్తుంటాడు. 5 వేల జీతంతో నెగ్గుకు రాలేని పరిస్థితుల్లో నీతి, నిజాయితీని పక్కనబెట్టి తన వ్యాపారాన్ని మార్చేస్తాడు. అలా కొద్దికాలంలోనే కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఆ క్రమంలో భాస్కర్ ఎలాంటి అడ్డదార్లు తొక్కాడు? అక్రమంగా సంపాదించిన డబ్బును భాస్కర్ భార్య సుమతి (మీనాక్షి చౌదరీ) ఎందుకు వద్దనుకొన్నది అనేది సంక్షిప్తంగా లక్కీ భాస్కర్ సినిమా కథ.

తొలిరోజు లక్కీ భాస్కర్ ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందోనని ఇండస్ట్రీ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. దీపావళి కావడంతో మ్యాట్నీ, సెకండ్ షోలకు బుకింగ్స్ బాగా జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సీతారామం తర్వాత దుల్కర్ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా అమ్మాయిలు లక్కీ భాస్కర్‌కు పోటెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150 ప్రీమియర్ షోలు పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో లక్కీ భాస్కర్ రూ. కోటికి పైగా రాబట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. తొలి రోజున దుల్కర్ సల్మాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 10 నుంచి రూ. 12 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











