ఎమ్.ఎస్.రాజు'తూనీగా తూనీగ'ఫైనల్ రిజల్ట్
ఇక ఈ చిత్రం గురించి రిలీజ్ కు ముందు దిల్ రాజు... నాకు ఈ సినిమా చూపించినప్పుడు ఫస్టాఫ్ సూపర్ అనిపించింది. క్లైమాక్స్ గొప్పగా ఉంది. ఈ మధ్యలోనే కాస్త లోటు అనిపించింది అని చెప్పారు. అయితే తాను కరెక్షన్స్ చెప్పానన్నారు కానీ అదేమీ వర్కవుట్ కాలేదు. ఆయన అన్నట్లుగానే సెకండాఫ్ చాలా డల్ అయిపోయింది. ఫస్టాఫ్ ఫన్ తో గడిచిపోయినా సెకండాఫ్ ప్రేక్షకులతో కనెక్టు తెగిపోయింది.
ఈ చిత్రం కథ విషయంకి వస్తే...హీరో,హీరోయిన్స్ ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. ఇద్దరి మధ్య మంచి నీళ్లు ఉన్నా కూడా పెట్రోలై మండుతుంది. 'నువ్వెంత అంటే నువ్వెంత' అనుకొంటూ పోట్లాడుకోవల్సిందే. ఒకరిని ఓడించడానికి మరొకరు ఎత్తులు వేస్తుంటారు. పెద్దయ్యాక కూడా ఈ సిట్యువేషన్ కొనసాగుతుంది. అలాంటిది ఇద్దరూ ఒక చోట కలిసుండాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే తమ స్వార్దం కోసం కొందరు వీరి ప్రేమలో చిచ్చు పెడతారు. దానిని అధిగమించి వీరిద్దరూ ఎలా ఒకటయ్యారనేది మిగతా చిత్రం.
సుమంత్ అశ్విన్, రియా...హీరో హీరోయిన్స్ గా పరిచయమైన ఈ చిత్రంలో కీలక పాత్రల్లో పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రభు, నాగబాబు, విజయ్‌చందర్, సాయాజీ షిండే తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎం.ఎస్.రాజు. సమర్పణ: దిల్ రాజు, నిర్మాత: మాగంటి రామ్‌చంద్రన్ (రామ్‌జీ).


Click it and Unblock the Notifications












