Maa Inti Bangaaram Day 1 Box Office: మా ఇంటి బంగారంకు భారీ ఓపెనింగ్స్.. సమంత మూవీకి ఎన్ని కోట్లంటే?

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన మా ఇంటి బంగారం సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబైంది. శ్రీముఖి, గౌతమి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు రచనా సహకారంతోపాటు నిర్మాతగా ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్, సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీకి హిమాంక్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ భారీగా ప్రారంభమైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం తొలి రోజు ఎంత వసూలు చేస్తుందనే అంచనా ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..

ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కామెడీ అంశాలతో రూపొందిన ఈ చిత్రాన్ని కంటెంట్ డిమాండ్ మేరకు భారీ వ్యయంతో రూపొందించారు. ఈ సినిమాను సుమారుగా 30 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 35 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ మూవీని సొంతంగా ట్రాలాలా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాత్రం ఏరియాల వారీగా పలు సంస్థలుకు ఇచ్చారు. అయితే ఈ సినిమా థియేట్రికల్ వాల్యూను కూడా 30 నుంచి 35 కోట్ల రూపాయల మేర వాల్యూ కట్టారు.

Maa Inti Bangaaram Day 1 Predicted Box Office

గతవారం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్‌లో ప్రారంభం కాగా, మంచి స్పందన వ్యక్తమవుతున్నది. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరగడంతో వసూళ్లు సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాను ప్రత్యాంగీరా సినిమాస్ రిలీజ్ చేస్తున్నది. నార్త్ అమెరికాలో ఈ సినిమాను గ్రాండ్‌గా దాదాపు 260 కి పైగా లొకేషన్లలో రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఒక రోజు ముందుగానే అంటే జూన్ 18వ తేదీన ఈ సినిమా ప్రీమియర్లు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే యూకే,ఐర్లాండ్, మలేషియా, సింగపూర్, గల్ఫ్ కంట్రీస్‌లో అత్యధిక స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు.

Also Read
Maa Inti Bangaaram First Review: మా ఇంటి బంగారం ఫస్ట్ రివ్యూ
Maa Inti Bangaaram First Review: మా ఇంటి బంగారం ఫస్ట్ రివ్యూ

నార్త్ అమెరికాలో ఈ సినిమా భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. తాజా సమాచారం ప్రకారం.. 125K అమెరికన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 1.18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా ప్రీమియర్స్ మొదలయ్యే సమయానికి ఈ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది అని ప్రత్యాంగీరా సినిమాస్ వెల్లడించింది. ఇతర దేశాల్లో కలిపి ఈ చిత్రం ఓవర్సీస్‌లో ప్రీమియర్లతో సహా తొలి రోజు 300K డాలర్లు .. భారత కరెన్సీలో 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

Recommended For You
Maa Inti Bangaaram Business: మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ బిజినెస్.. సమంత మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
Maa Inti Bangaaram Business: మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ బిజినెస్.. సమంత మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

ఇక ఇండియాలో కూడా ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్లు పెద్ద సంఖ్యలో తెగుతున్నాయి. ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం.. ఆన్ లైన్ ద్వారా 2 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. తొలి రోజు ఈ చిత్రం 4 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే.. ఈ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఈ సినిమా తొలి రోజు 6.5 నుంచి 7.5 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X