MIB Day 11 Collections: అనుష్క రికార్డ్ బ్రేక్ చేసిన సమంత.. ‘మా ఇంటి బంగారం'కి ఎన్ని కోట్లంటే?

Maa Inti Bangaaram Box Office Collections: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ యాక్షన్-ఫ్యామిలీ థ్రిల్లర్, రెండో వారంలో కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ముఖ్యంగా రెండో ఆదివారం అందుకున్న భారీ వసూళ్లు మరోసారి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కొత్త సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాకే ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో 11 రోజుల్లో మా ఇంటి బంగారం'ఎన్ని కోట్లు రాబట్టింది? అనేది పరిశీలిస్తే..

ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సుమారు 28 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం'సినిమాలో సమంతతో పాటు శ్రీముఖి, ఆనంద్, గౌతమి, శ్రీలక్ష్మీ, దిగంత్ మంచాలే, చైతన్య కృష్ణ, గుల్షన్ దేవయ్య, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ, ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 35 కోట్ల రూపాయల షేర్, దాదాపు 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించాలని టార్గెట్.

Maa Inti Bangaaram Day 11 expected Box Office Collections

తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. 10వ రోజు 'మా ఇంటి బంగారం' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 5.30 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు అందుకుంది. 9వ రోజు వచ్చిన 4.90 కోట్ల రూపాయల నెట్ తో పోలిస్తే ఇది దాదాపు 8.2 శాతం ఎక్కువ. దీంతో సినిమా 10 రోజుల్లో మొత్తం 48.25 కోట్ల రూపాయల నెట్, 55.86 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. రెండో వీకెండ్‌లో కూడా ఈ స్థాయి కలెక్షన్లు వసూలు చేయడం సమంత క్రేజీకు నిదర్శనమనే చెప్పాలి.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సమంత సినిమా అదే జోరును కొనసాగిస్తోంది. 10వ రోజు మరో 1 కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయడంతో విదేశాల్లో మొత్తం 22.85 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా 78.71 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. ఈ వసూళ్లతో సమంత కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియంట్ సినిమాగా నిలిచింది. అంతేకాదు, అనుష్క శెట్టి నటించిన క్లాసిక్ బ్లాక్‌బస్టర్'అరుంధతి' లైఫ్‌టైమ్ ప్రపంచవ్యాప్త వసూళ్లను కూడా అధిగమించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక 11వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. అంచనాల ప్రకారం మధ్యాహ్నం వరకు సినిమా 17 లక్షల రూపాయల నెట్ వసూలు చేసింది. వీక్‌డే కావడంతో సాధారణంగా కలెక్షన్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ట్రేడ్ వర్గాలు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల నెట్ మధ్య వసూళ్లు నమోదు చేసే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. సాయంత్రం, రాత్రి షోలకు మంచి స్పందన లభిస్తే ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ ను ఈరోజే అందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటిన మా ఇంటి బంగారం సినిమా భారీ లాభాలను అందుకుంటున్నట్టు తెలుస్తోంది. సమంత సోలో హీరోయిన్‌గా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా మరోసారి నిరూపించిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే అసలు పరీక్ష ఇప్పుడు ప్రారంభం కానుంది. రెండో వారంలో వీక్‌డేస్‌లో కూడా ఇదే స్థాయిలో కలెక్షన్లు అందుకుంటే.. 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకోవడం అసాధ్యం కాదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ట్రెండ్ ను గమనిస్తే.. సమంత కెరీర్‌లో 'మా ఇంటి బంగారం' మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మార్క్ క్రాస్ చేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X