MIB Day 12 Collections: సమంత మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. మా ఇంటి బంగారం వసూళ్లు ఎంతంటే?

బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ విజయవంతంగా దూసుకెళ్తోంది. తొలివారం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన మా ఇంటి బంగారం.. సెకండ్ వీక్‌ ఎండింగ్‌కు వచ్చేసింది. రెండో సోమవారం కాస్త స్లో అయిన నేపథ్యంలో సెకండ్ వీక్‌ని సమంత ఎలా ముగిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో 12వ రోజు మా ఇంటి బంగారం వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టింది? ఇప్పటి వరకు సమంత మూవీ ఎంత వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులు మా ఇంటి బంగారాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి ఈ సినిమాకు 28 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ మూవీ బ్రేక్ఈవెన్ వాల్యూను 35 కోట్ల రూపాయల షేర్.. 70 కోట్ల రూపాయల గ్రాస్‌గా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Maa Inti Bangaaram Day 12 expected Box Office Collections Samantha movie sees drop on second tuesday

మా ఇంటి బంగారం 11 రోజుల కలెక్షన్స్
70 కోట్ల రూపాయల టార్గెట్‌తో జూన్ 19న వరల్డ్ వైడ్‌గా విడుదలైన మా ఇంటి బంగారం మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 13.15 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టి సమంత స్టార్ పవర్‌ను తెలియజేసి, ఆమె టాలీవుడ్‌లో ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చింది. తొలి వారం మా ఇంటి బంగారం మూవీ ఇండియాలో 33.70 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. ఎనిమిదవ రోజున ఇండియాలో 4.35 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 4.90 కోట్ల రూపాయలు, పదో రోజున 5.30 కోట్ల రూపాయలు, పదకొండవ రోజున 1.60 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తద్వారా ఇప్పటి వరకు భారత్‌లో 49.85 కోట్ల రూపాయల నెట్.. 57.72 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది.

వివిధ రాష్ట్రాల్లో కలెక్షన్స్
11 రోజుల వరకు తెలంగాణలో 27.13 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 18.74 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 10.37 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5.23 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 89 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది. ఓవరాల్‌గా తెలుగు వెర్షన్‌లో 47.23 కోట్ల రూపాయలు, తమిళ వెర్షన్‌లో 2.62 కోట్ల రూపాయలు రాబట్టింది మా ఇంటి బంగారం.

ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలో సమంత స్పష్టమైన హవాతో అన్ని సినిమాలను దాటేస్తూ వసూళ్లు రాబడుతోంది. అమెరికా, కెనడాలలో ఇప్పటి వరకు మా ఇంటి బంగారం మూవీ 1.8 మిలియన్ డాలర్లు (17 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, యూకే, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను (19 కోట్ల రూపాయలు) ఇప్పటికే క్రాస్ చేసింది. అయితే సాక్‌నిక్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సమంత మూవీకి విదేశాలలో 23.15 కోట్ల రూపాయలు వచ్చింది. భారత్‌లో వచ్చిన వసూళ్లు కూడా కలుపుకుంటే వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 81 కోట్ల రూపాయలు క్రాస్ చేసింది.

12వ రోజు వసూళ్లు అంచనా
ఇప్పటి వరకు వసూళ్ల హవా సాగించిన మా ఇంటి బంగారం మూవీ జైత్రయాత్రకు సెకండ్ మండే బ్రేక్ వేసింది. వరల్డ్ వైడ్‌గా 11వ రోజు కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. కెరీర్‌లో సోలోగా తొలి 100 కోట్ల రూపాయల మూవీని తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న సమంతకు ఈ లెక్కలు షాకిస్తున్నాయి. మంగళవారం మా ఇంటి బంగారం మూవీకి అంతంత మాత్రంగానే బుకింగ్స్ జరుగుతున్నాయి.

11వ రోజు సాయంత్రం 4 గంటల వరకు మా ఇంటి బంగారం మూవీకి ఇండియాలో 1185 షోలు ప్రదర్శితమై 19 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ సాధించినట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సమంత మూవీకి ఇండియాలో 51 లక్షల రూపాయల నికర వసూళ్లు వచ్చాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాలలో 75 లక్షల రూపాయలు, ఓవర్సీస్+ రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు చొప్పున 1.30 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లు రావొచ్చని భావిస్తున్నారు.

100 కోట్లపై సమంత కన్ను
లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ట్రెండ్ సెట్ చేసిన అరుంధతి వసూళ్లను బ్రేక్ చేసిన మా ఇంటి బంగారం.. తాజాగా కీర్తి సురేష్ మహానటి మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ (84.5 కోట్ల రూపాయలు) రికార్డ్‌పై సమంత కన్నేసింది. రెండో వారం ముగిసేనాటికి ఈ రికార్డ్‌ను మా ఇంటి బంగారం క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే శుక్రవారం నాగబంధం, రావు బహదూర్ తదితర సినిమాల నుంచి మా ఇంటి బంగారానికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉండటంతో మరి ఈ సినిమా 100 కోట్ల రూపాయల మార్క్ చేరుతుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X