MIB Box Office: 27 ఏళ్ల అనుష్క రికార్డు సమంత బ్రేక్ .. మా ఇంటి బంగారంకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల్లోను, అలాగే ఓవర్సీస్‌లో వసూళ్ల తడాఖాను చూపిస్తున్నది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రినివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్, మ్యూజిక్: సంతోష్ నారాయణన్, ఫైట్స్: లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదర్ తదితరలు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ వాల్యూ ఎంత? ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత మేరకు వసూళ్లను సాధించింది అనే వివరాల్లోకి వెళితే..

Maa Inti Bangaaram Day 13 Expected Box Office

యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమాను సుమారుగా 28 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ అమ్మకాలతో ఈ సినిమా 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని కమీషన్ బేస్ మీద ట్రాలాలా సంస్థ సొంతంగా రిలీజ్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 36 కోట్ల రూపాయల షేర్, 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో వాల్యూ చేశామని చిత్ర యూనిట్ తెలిపింది.

Also Read
Nagabandham Business: నాగబంధం వరల్డ్‌వైడ్ బిజినెస్.. బడ్జెట్, బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎన్ని కోట్లంటే?
Nagabandham Business: నాగబంధం వరల్డ్‌వైడ్ బిజినెస్.. బడ్జెట్, బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎన్ని కోట్లంటే?

మా ఇంటి బంగారం చిత్రం తొలి ఆట నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. ఈ చిత్రం తొలి రోజు 12.9 కోట్ల రూపాయల గ్రాస్, రరెండో రోజు 13 కోట్ల రూపాయల గ్రాస్, మూడో రోజు 13.5 కోట్ల రూపాయల గ్రాస్‌తో తొలి వారాంతం దాదాపు 39 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది. తొలివారం ముగిసే సమయానికి 33.5 కోట్ల గ్రాస్ 60 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Recommended For You
Rao Bahadur First Review: రావు బహదూర్ మూవీ ఫస్ట్ రివ్యూ
Rao Bahadur First Review: రావు బహదూర్ మూవీ ఫస్ట్ రివ్యూ

ఇక రెండో వారంలోను సమంత మూవీ బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శించింది. ఈ చిత్రం 8వ రోజు 4.5 కోట్ల రూపాయల నెట్, 9వ రోజు 5 కోట్ల నెట్, 10వ రోజు 5.5 కోట్లు, 11వ రోజు 1.6 కోట్ల రూపాయలు, 12వ రోజు 1.65 కోట్ల రూపాయల నెట్ వసూళ్లతో 51 కోట్ల నెట్, 86 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

You May Also Like
Rao Bahadur Business: రావు బహదూర్ బడ్జెట్ ఎంత? బిజినెస్ ఎన్ని కోట్లు.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
Rao Bahadur Business: రావు బహదూర్ బడ్జెట్ ఎంత? బిజినెస్ ఎన్ని కోట్లు.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

ఈ చిత్రం తెలంగాణలో 28 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 20 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 10 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 64.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో 2.5 మిలియన్ డాలర్లు అంటే 22 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 86 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా 13వ రోజున మరో రెండు కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 88 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Nagabandham First Revview: నాగబంధం మూవీ ఫస్ట్ రివ్యూ
Nagabandham First Revview: నాగబంధం మూవీ ఫస్ట్ రివ్యూ
మా ఇంటి బంగారం చిత్రం దక్షిణాదిలో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. తెలుగులో ఇప్పటి వరకు 2009 సంవత్సరంలో అనుష్క శెట్టి నటించిన అరుంధతి చిత్రం 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ రికార్డును 27 ఏళ్ల తర్వాత ఓ స్టార్ హీరోయిన్ రూపంలో సమంత బ్రేక్ చేసింది. ఇండియా వైడ్‌గా చూసుకొంటే.. శ్రద్దాకపూర్ నటించిన స్త్రీ చిత్రం 200 కోట్లకుపైగా, లోక చిత్రం 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం మా ఇంటి బంగారం 3వ స్థానంలో అత్యధికంగా వసూళ్లు సాధించిన లేడీ హీరోయిన్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X