MIB Day 15 Box Office: మహానటి రికార్డు మా ఇంటి బంగారం బ్రేక్ .. 100 కోట్లకు అడుగు దూరంలో సమంత మూవీ!
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం గత రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద సంచలన కలెక్షన్లను నమోదు చేస్తున్నది. గత రెండు వారాలుగా రిలీజైన సినిమాల పోటీని తట్టుకొని ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. లేడీ ఓరియెంట్ సినిమాల్లో అత్యధిక వసూలు చేసిన తెలుగు చిత్రంగా ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఇప్పటి వరకు తెలుగులో అరుంధతి, మహానటి సినిమాలు సాధించిన లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించింది. ఈ సినిమా గత 14 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ చిత్రం 15వ రోజు రాబట్టే వసూళ్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
మా ఇంటి బంగారం చిత్రం విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్మకాల వల్ల టేబుల్ ప్రాఫిట్‌ను సాధించింది. ఈ చిత్రాన్ని ట్రాలాలా బ్యానర్ సొంతంగా రిలీజ్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 35 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మా ఇంటి బంగారం సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ సినిమా తొలి వారం 34 కోట్ల రూపాయలు, రెండో వారంలో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 14 రోజుల్లో ఇండియాలో 54 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను, 69.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక రాష్ట్రాల వారీగా ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో 30 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 21 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 11.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 69.5 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమాకు నార్త్ అమెరికాతోపాటు ఇతర దేశాల్లో కూడా భారీగా వసూళ్లను రాబట్టింది. అమెరికా, కెనడాలో కలిపి ఈ చిత్రం 2 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, యూకే, ఐర్లాండ్‌లో 115K పౌండ్లు, మలేషియాలో 100K RM, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 250K డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారుగా 3 మిలియన్ డాలర్లకు చేరువైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం దాదాపు 25 కోట్ల రూపాయలు ఓవర్సీస్‌లో రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దాంతో ఈ చిత్రం 95 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మా ఇంటి బంగారం చిత్రం 15వ రోజున కూడా స్టడీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం లేటేస్ట్ సినిమాల పోటీ తట్టుకొని 1 కోటికిపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని అంచనా వేశారు. దాంతో ఈ చిత్రం 96 కోట్ల రూపాయల గ్రాస్ నమోదు చేసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో ఈ చిత్రం 100 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.
మా ఇంటి బంగారం చిత్రం తాజాగా కీర్తీ సురేష్ నటించిన మహానటి చిత్రం లైఫ్ టైమ్ కలెక్షన్లు 85 కోట్ల వసూళ్లను అధిగమించింది. అంతేకాకుండా ఈ ఏడాది అంటే 2026 సంవత్సరంలో అత్యధికంగా వసూళ్లు చేసిన సినిమాల్లో 6వ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. రానున్న రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఎంత వసూలు చేస్తుందనే విషయంపై ట్రేడ్ వర్గాలు దృష్టిపెట్టాయి.


Click it and Unblock the Notifications