MIB Day 18 Box Office: సమంత బాక్సాఫీస్ ఊచకోత.. మా ఇంటి బంగారం సినిమాకు ఎన్ని కోట్లంటే?
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం గత రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద సంచలన కలెక్షన్లను నమోదు చేస్తున్నది. గత రెండు వారాలుగా రిలీజైన సినిమాల పోటీని తట్టుకొని ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. లేడీ ఓరియెంట్ సినిమాల్లో అత్యధిక వసూలు చేసిన తెలుగు చిత్రంగా ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఇప్పటి వరకు తెలుగులో అరుంధతి, మహానటి సినిమాలు సాధించిన లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించింది. ఈ సినిమా గత 14 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ చిత్రం 15వ రోజు రాబట్టే వసూళ్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే.. ి
మా ఇంటి బంగారం సినిమా తొలి రోజు నుంచే బంపర్ కలెక్షన్లను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాలు, కన్నడ, తమిళ రాష్ట్రాల్లో ఈ సినిమా తొలివారం 34 కోట్ల రూపాయలు, రెండో వారంలో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం రెండు వారాల్లో 54 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. బాక్సాఫీస్ వద్ద అదే జోరును మూడో వారంలో కూడా కొనసాగించింది.

ఇక మూడో వారంలో సమంత సినిమాకు మంచి ఆదరణే కనిపించింది. ఈ చిత్రం 15వ రోజున 1 కోటి రూపాయలు గ్రాస్, 16వ రోజు 1.75 కోట్ల గ్రాస్, 17వ రోజు 2 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో మూడో వారంలో 4.75 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా గత 17 రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో 32 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 23 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 12.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ చిత్రం 73.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
ఓవర్సీస్‌లో ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలోనే 2 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 19 కోట్ల రూపాయలు, ఇతర దేశాల్లో 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 26 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు 99.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇక 18వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం మరో 1 కోటి రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. తద్వారా ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇక సమంత కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా, అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో దక్షిణాదిలో లోక సినిమా తర్వాత రెండో స్థానంలో ఈ చిత్రం రికార్డుగా నిలిచింది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఊచకోత కోయడం ఇటీవల కాలంలో అరుదుగా కనిపించింది అనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications