Maa Inti Bangaaram Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద సమంత జోరు.. మా ఇంటి బంగారానికి రెండో రోజు ఎంతంటే?

నందినీ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్రనటి సమంత తాజాగా నటించిన మూవీ మా ఇంటి బంగారం. ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ కలిసి నిర్మించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు. జూన్ 19న మా ఇంటి బంగారం మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు సమంత మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

మా ఇంటి బంగారం తారాగణం
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షణ్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి మా ఇంటి బంగారం మూవీకి దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం సమంత ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారని సమాచారం. సమంత టాలీవుడ్ కమ్ బ్యాక్, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో మా ఇంటి బంగారం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే సమంత మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న దానిని బట్టి సమంత మూవీకి వరల్డ్ వైడ్‌గా 30 నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్‌లో థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా విలువ కట్టారు. ఈ సినిమా బ్రేక్ఈవెన్ టార్గెట్‌ను 35 కోట్ల రూపాయలుగా వాల్యూ నిర్దేశించారు.

Maa Inti Bangaaram Day 2 Box Office Collections Worldwide Samantha Movie witnessed good occupancy

మా ఇంటి బంగారం తొలిరోజు కలెక్షన్స్
భారీ అంచనాల మధ్య విడుదలైన మా ఇంటి బంగారం మూవీకి తొలిరోజున తెలంగాణలో 2.92 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 1.78 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 89 లక్షల రూపాయలు, తమిళనాడులో 20 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 8 లక్షల రూపాయలు చొప్పున సమంత మూవీ ఇండియాలో 5.35 కోట్ల రూపాయల నెట్.. 6.20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది.

మా ఇంటి బంగారం ఓవర్సీస్ కలెక్షన్స్
ఇక ఈ సినిమా ఓవర్సీస్‌ కలెక్షన్స్ పరిశీలిస్తే.. అమెరికాలో 245 సెంటర్స్‌లో 537 ప్రీమియర్ షోలను ప్రదర్శించగా.. 11441 టికెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా ప్రీమియర్ షోల కింద అమెరికాలో 166,972 డాలర్లు (భారత కరెన్సీలో 1.57 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తం నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా 175K డాలర్లు (1.65 కోట్ల రూపాయలు) రాబట్టింది. ప్రీమియర్స్ + డే 1 కలిపి నార్త్ అమెరికాలో 217K డాలర్లు (2.04 కోట్ల రూపాయలు) వసూలు చేసింది.

వసూళ్లపై సమంత ప్రకటన
అలాగే యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, సింగపూర్, మలేషియా తదితర దేశాలతో కలిపి మొత్తంగా మా ఇంటి బంగారం తొలిరోజున ఓవర్సీస్‌లో 700K డాలర్లు (6.60 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మా ఇంటి బంగారం మూవీకి వరల్డ్ వైడ్‌గా దాదాపు 12.80 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే తమ చిత్రం తొలిరోజున వరల్డ్ వైడ్‌గా 13.15 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు స్వయంగా చిత్ర నిర్మాత, హీరోయిన్ సమంత ప్రకటించారు.

మా ఇంటి బంగారం రెండో రోజు వసూళ్ల అంచనా
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌, సమంత స్టార్‌డమ్, వీకెండ్ కారణంగా సమంత మూవీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. రెండో రోజు మా ఇంటి బంగారం మూవీకి ఇండియాలో ఇప్పటి వరకు 1079 షోలు ప్రదర్శితమై.. 28.7 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. సమంత మూవీకి శనివారం హైదరాబాద్‌లో 370 షోలు, బెంగళూరులో 262 షోలు, విశాఖలో 83 షోలు, చెన్నైలో 74 షోలు, విజయవాడలో 64 షోలు ప్రదర్శితమైనట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ షో, ఈవెనింగ్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రెండో రోజు మా ఇంటి బంగారం మూవీకి ఇండియా వైడ్‌గా ఇప్పటి వరకు 1.22 కోట్ల రూపాయల నెట్ వసూలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు శనివారం తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు, తమిళంలో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 35 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా రెండో రోజున 5 నుంచి 7 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X