Maa Inti Bangaaram Day 3 Collections: 50 కోట్లకు చేరువగా మా ఇంటి బంగారం.. సమంత మూవీకి మూడో రోజు ఎంతంటే?

టాలీవుడ్ అగ్రనటి సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సమంత స్టార్ పవర్ తెలియజేసేలా భారత్‌తో పాటు విదేశాల్లోనూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. తొలిరోజే వరల్డ్ వైడ్‌గా ఏకంగా 13.15 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మూడో రోజు మా ఇంటి బంగారం ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

మా ఇంటి బంగారం తారాగణం
మా ఇంటి బంగారం మూవీకి బీవీ నందినీ రెడ్డి దర్శకత్వం వహించగా.. ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ కలిసి నిర్మించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు. జూన్ 19న మా ఇంటి బంగారం మూవీ విడుదలైంది. ఈ సినిమాను 30 నుంచి 35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించినట్లుగా ఫిలింనగర్ టాక్. మా ఇంటి బంగారం మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 35 కోట్లు రాబట్టాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు,

Maa Inti Bangaaram Day 3 Box Office Collections Worldwide Samantha Movie heading towards 50 crores mark

మా ఇంటి బంగారం రెండు రోజుల కలెక్షన్స్
సమంత మూవీకి ఇండియాలో తొలి రోజున 5.35 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.50 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 13.32 కోట్ల రూపాయల నెట్.. 14.84 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటి వరకు తెలంగాణలో 6.84 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 4.25 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2.40 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.45 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 29 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసింది.

మా ఇంటి బంగారం ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో సమంత మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికా, కెనడాలలో ఇప్పటి వరకు మా ఇంటి బంగారం మూవీకి 850K డాలర్లు (భారత కరెన్సీలో 8 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ఈ సినిమాకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోన్న ప్రత్యంగిరా మూవీస్ ప్రకటించింది. ఆదివారం కూడా మా ఇంటి బంగారం నార్త్ అమెరికాలో దుమ్మురేపుతోంది. 231 సెంటర్స్‌కి గాను సండే అడ్వాన్స్ బుకింగ్‌లో 260K డాలర్లు (2.45 కోట్ల రూపాయలు) ఆర్జించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మూడో రోజున నార్త్ అమెరికాలో సమంత మూవీ 300K మార్క్ (2.82 కోట్ల రూపాయలు) అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ వీకెండ్‌లో సమంత నార్త్ అమెరికాలో 1 మిలియన్ మార్క్ టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

నార్త్ అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, యూకే, సింగపూర్, మలేషియా తదితర దేశాలతో కలిపి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు మా ఇంటి బంగారం మూవీ 10.60 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తద్వారా భారత్‌లో వచ్చిన గ్రాస్+ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు సమంత మూవీకి వరల్డ్ వైడ్‌గా 26 కోట్ల రూపాయల గ్రాస్..13 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. అయితే తమ సినిమా వరల్డ్ వైడ్‌గా 28 కోట్ల రూపాయలు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.

మా ఇంటి బంగారం మూడో రోజు వసూళ్ల అంచనా
ఆదివారం మా ఇంటి బంగారం మూవీకి భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు బుక్ మై షోలో 15K బుకింగ్ జరిగాయి. కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా మహిళలు సినిమాను ఆదరిస్తున్నారు. మూడో రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు మా ఇంటి బంగారం సినిమాకు ఇండియా వైడ్‌గా 1366 షోలు ప్రదర్శితమై.. 44.3 శాతం ఆక్యూపెన్సీ సాధించినట్లు సాక్‌నిక్ పేర్కొంది.

ఇప్పటి వరకు సమంత మూవీకి ఇండియాలో 3 కోట్ల రూపాయల నెట్ వసూలైంది. ఆదివారం మా ఇంటి బంగారం సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల రూపాయలు, తమిళనాడులో కోటి రూపాయలు, కర్ణాటకలో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ ముగిసేనాటికి మా ఇంటి బంగారం ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలకు పైగా రాబడుతుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X