MIB Day 4 Box Office Collections: బాక్సాఫీస్‌పై సమంత మాస్ ఫైరింగ్.. మా ఇంటి బంగారంకు ఎన్ని కోట్లంటే?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల్లోను, అలాగే ఓవర్సీస్‌లో వసూళ్ల తడాఖాను చూపిస్తున్నది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రినివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్, మ్యూజిక్: సంతోష్ నారాయణన్, ఫైట్స్: లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదర్ తదితరలు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ వాల్యూ ఎంత? ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత మేరకు వసూళ్లను సాధించింది అనే వివరాల్లోకి వెళితే..

Maa Inti Bangaaram 4 Days Box Office Report

యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమాను సుమారుగా 28 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ అమ్మకాలతో ఈ సినిమా 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని కమీషన్ బేస్ మీద ట్రాలాలా సంస్థ సొంతంగా రిలీజ్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 36 కోట్ల రూపాయల షేర్, 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో వాల్యూ చేశామని చిత్ర యూనిట్ తెలిపింది.

సమంత నటించిన మూవీ తొలి రోజు ఇండియాలో 6.5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు, ఓవర్సీస్‌లో 6.5 కలెక్షన్లు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు తెలిపితే.. ఈ చిత్రం తొలి రోజు 13.15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని చిత్ర యూనిట్ తెలిపింది. రెండో రోజు ఈ చిత్రం మరో 13 కోట్ల రూపాయలు, మూడో రోజు 14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 40.15 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపితే.. నిర్మాతలు ఈ చిత్రం 43 కోట్ల రూపాయలు వసూలు చేసిందని అధికారికంగా ప్రకటించారు.

మా ఇంటి బంగారం సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్నాటకలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకొంటున్నది. ఈ చిత్రం తాజా సమాచారం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు.. హైదరాబాద్‌లోనే 25 వేలకుపైగా టికెట్ల అమ్మకాలను పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా 90 వేల టికెట్లు అమ్ముడుపోయాయని ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సైట్స్ అధికారికంగా వెల్లడించాయి. మధ్యాహ్నం వరకు ఈ సినిమా 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా నైట్ షోలకు ఫుల్ రెస్పాన్స్ కనిపిస్తున్నది. కాబట్టి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలో 3 కోట్ల వరకు, కర్ణాటకలో 50 లక్షలు, ఇండియాలో 4 కోట్ల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఓవర్సీస్ కలుపుకొని 5 కోట్లకు అటు ఇటుగా వసూళ్లను సాధించే ఛాన్స్ మెండుగా ఉన్నాయి అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మా ఇంటి బంగారం బాక్సాఫీస్ ఊపు చూస్తే.. తొలి వారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ చిత్రం ఇప్పటికే 50 కోట్లకు చేరువైంది. ఈ సినిమా రానున్న రోజుల్లో 75 కోట్ల లక్ష్యంగా పరుగులు పెడుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ చిత్రం ఏ రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాల్సిందే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X