MIB Day 5 Collections: మా ఇంటి బంగారంకు డీసెంట్ కలెక్షన్స్... సమంత మూవీకి ఐదో రోజు ఎంతంటే?

నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఫస్ట్ వీకెండ్‌లో రెచ్చిపోయిన సామ్.. మండే టెస్ట్‌లోనూ పాసై 50 కోట్ల మార్క్ దిశగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం మూవీ ఐదో రోజైన మంగళవారం వరల్డ్ వైడ్‌గా ఎంత వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

మా ఇంటి బంగారం బడ్జెట్ అండ్ బ్రేక్ఈవెన్
ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మా ఇంటి బంగారం మూవీని 28 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. శ్రీముఖి, ఆనంద్, గౌతమి, శ్రీలక్ష్మీ , దిగంత్ మంచాలే, చైతన్య కృష్ణ, గుల్షన్ దేవయ్య, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం, ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్, ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మా ఇంటి బంగారం మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే 35 కోట్ల రూపాయల షేర్.. 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Maa Inti Bangaaram Day 5 Box Office Collections Worldwide Samantha Movie getting Decent Numbers

మా ఇంటి బంగారం 4 రోజుల కలెక్షన్స్
మా ఇంటి బంగారం మూవీ తొలిరోజున 5.35 రూపాయల ఓపెనింగ్స్ రాబట్టగా.. రెండో రోజున 7.65 కోట్ల రూపాయలు, మూడో రోజున 10.10 కోట్ల రూపాయలతో ఫస్ట్ వీకెండ్‌‌లోనే ఇండియాలో ఏకంగా 25 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. నాలుగో రోజైన సోమవారం పరిస్ధితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ సమంత తన మార్క్ చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఆదరణను అందుకుని 4.10 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో మండే టెస్ట్ పాసైంది మా ఇంటి బంగారం. నాలుగు రోజుల వరకు సమంత మూవీ ఇండియాలో 27 కోట్ల రూపాయల నెట్ .. 31 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ పేర్కొంది.

ఇప్పటి వరకు తెలంగాణలో 13.89 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 9.37 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2.88 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 68 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది. ఇప్పటి వరకు తెలుగు వెర్షన్‌లో 30 కోట్ల రూపాయలు, తమిళ వెర్షన్‌లో 1.89 కోట్ల రూపాయలు రాబట్టింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లోని నైజాం ఏరియాలో మా ఇంటి బంగారం దుమ్మురేపుతోంది. 4వ రోజు ఇక్కడ 2.05 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టగా.. ఓవరాల్‌గా 12.35 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మా ఇంటి బంగారం ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లో కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 1.5 మిలియన్ డాలర్లు (14.20 కోట్ల రూపాయలు), ఆస్ట్రేలియా - న్యూజిలాండ్‌లలో 150K ఆస్ట్రేలియా డాలర్లు (కోటి రూపాయలు)+ ఇతర దేశాలలో కలిపి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు మా ఇంటి బంగారం మూవీ వరల్డ్ వైడ్‌గా 46.48 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే తమ చిత్రం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల మార్క్ దాటినట్లు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.

మా ఇంటి బంగారం ఐదో రోజు వసూళ్ల అంచనా
పెద్ది, కాక్‌టెయిల్ 2 వంటి సినిమాలు థియేటర్స్‌లో ఉన్నప్పటికీ ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది మా ఇంటి బంగారం. మంగళవారం కూడా మంచి బుకింగ్స్ నమోదు చేసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. పాజిటివ్ రివ్యూలు, టాక్‌తో ఐదో రోజు సమంత మూవీకి ఇండియాలో సాయంత్రం 4 గంటల వరకు 1421 షోలు ప్రదర్శితమై... 23.5 శాతం ఆక్యూపెన్సీ సాధించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం భారత్‌లో 5వ రోజు 1.29 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సమంత మూవీ ఐదో రోజున వరల్డ్ వైడ్‌గా 3.50 కోట్ల రూపాయల రేంజ్‌లో కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X