MIB Day 6 Collections: బాక్సాఫీస్ వద్ద సమంత దూకుడు.. మా ఇంటి బంగారానికి ఎన్ని కోట్లంటే?

నందినీ రెడ్డి దర్వకత్వంలో టాలీవుడ్ అగ్రనటి సమంత నటించిన మూవీ మా ఇంటి బంగారం. ఫ్యామిలీ, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీని ట్రాలాలా మూవీంగ్ పిక్సర్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులు నిర్మించారు. జూలై 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే 50 కోట్ల రూపాయల మార్క్ అందుకుంది. మరి ఆరో రోజు మా ఇంటి బంగారం ఎన్ని కోట్లు రాబట్టింది? సమంత హవా ఎలా ఉంది? ఈ వివరాలు పరిశీలిస్తే..

మా ఇంటి బంగారం మూవీ సమంత స్టార్ పవర్ తెలియజేసేలా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలిరోజులు ఏకంగా 13.15 కోట్ల రూపాయలు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. వీకెండ్‌తో పాటు వర్కింగ్ డేస్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చేసింది సమంత మూవీ. మా ఇంటి బంగారం మూవీ తొలిరోజున ఇండియాలో 5.35 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. రెండో రోజు 7.65 కోట్ల రూపాయలు, మూడో రోజున 10.10 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. తొలి రోజును మించి వీకెండ్‌లో దుమ్మురేపిన మా ఇంటి బంగారం ఫస్ట్ వీకెండ్‌లోనే 25 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది.

Maa Inti Bangaaram Day 6 Box Office Collections Worldwide Samantha Movie Maintained a steady run

మా ఇంటి బంగారం 5 రోజుల కలెక్షన్స్
వీకెండ్ వరకు బాగానే ఉన్నప్పటికీ సోమవారం మా ఇంటి బంగారం వసూళ్లు ఎలా ఉంటాయోనని భావించిన వారికి వర్కింగ్ డేస్‌లోనూ అదే జోరు కొనసాగించింది సమంత. నాలుగో రోజున 4.10 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3.50 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో ఇండియాలో 5 రోజుల వరకు 31 కోట్ల రూపాయల నెట్.. 36 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. సమంత మూవీ ఐదు రోజుల వరకు తెలంగాణలో 15.92 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 10.62 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటకలో 5.73 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3.23 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 72 లక్షలు వసూలు చేసింది. అలాగే తెలుగులో దాదాపు 30 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. తమిళంలో 1.56 కోట్ల రూపాయలు రాబట్టింది.

మా ఇంటి బంగారం ఓవర్సీస్ కలెక్షన్స్
అయితే మా ఇంటి బంగారం ఘన విజయం సాధించడానికి ఓవర్సీస్ కలెక్షన్స్ ప్రధాన కారణం ఓవర్సీస్ మార్కెట్ అని విశ్లేషకులు చెబుతున్నారు. మంగళవారం ఈ సినిమాకు నార్త్ అమెరికాలో 160K డాలర్లు (1.51 కోట్ల రూపాయలు) రాగా.. ఓవరాల్‌గా ఉత్తర అమెరికాలో 1.25 మిలియన్ డాలర్లు (11.83 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నార్త్ అమెరికాతో పాటు యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, సింగపూర్ తదితర దేశాలలో కలిపి మా ఇంటి బంగారంకు ఓవర్సీస్‌లో 1.73 మిలియన్ డాలర్లు (16.38 కోట్ల రూపాయలు) వచ్చింది. భారత్‌లో వచ్చిన గ్రాస్‌తో కలిపి 5 రోజుల వరకు మా ఇంటి బంగారం సినిమాకు వరల్డ్ వైడ్‌గా 52.60 కోట్ల రూపాయలు వసూలైంది. తద్వారా సమంత కెరీర్‌లో సోలోగా 50 కోట్ల రూపాయల మార్క్ చేపట్టిన తొలి సినిమాగా మా ఇంటి బంగారం నిలిచింది.

6వ రోజు మా ఇంటి బంగారం వసూళ్ల అంచనా
సమంత స్టార్ పవర్‌కు తోడు పాజిటివ్ రివ్యూలు, కుటుంబ ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా వర్కింగ్ డేస్‌లోనూ ఈ సినిమా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తోంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకి మంచి ఆక్యూపెన్సీ నమోదవుతున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. 6వ రోజు సాయంత్రం 4 గంటల వరకు మా ఇంటి బంగారం సినిమాకు ఇండియాలో 1446 షోలు ప్రదర్శితమై 78 లక్షల రూపాయల నికర వసూళ్లను సాధించినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. హైదరాబాద్‌లో 489 షోలు, బెంగళూరులో 348 షోలు, విశాఖలో 98 షోలు ప్రదర్శితమయ్యాయి. ఈ ట్రెండ్స్‌ను బట్టి చూస్తుంటే ఆరో రోజు మా ఇంటి బంగారం మూవీ తెలుగు రాష్ట్రాల్లో 2.50 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 3.50 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మా ఇంటి బంగారం మూవీని 28 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 35 రూపాయలుగా విలువ కట్టారు. దాంతో సమంత మూవీ లాభాల్లోకి రావాలంటే 70 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని వాల్యూ నిర్దేశించారు. మరో 17 కోట్ల రూపాయలు వసూలు చేస్తే సమంత మూవీ డిస్ట్రిబ్యూషన్ పరంగా బ్లాక్‌బస్టర్ ఇమేజ్‌ను సొంతం చేసుకోనుంది. అయితే నిర్మాతలు మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే 35 కోట్ల రూపాయలు దక్కించుకుని బడ్జెట్ పోగా లాభాలను పొందారు. థియేట్రికల్ బిజినెస్ టార్గెట్‌ను మా ఇంటి బంగారం క్రాస్ చేస్తే మరిన్ని లాభాలను అందుకోనుంది ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్. ఈ వారం పెద్ద సినిమాలు లేకపోవడం, కుటుంబ ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా ఈ సినిమా 85 నుంచి 100 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X