MIB Day 7 Collections: బాక్సాఫీస్‌పై సమంత వసూళ్ల ఎటాక్.. మా ఇంటి బంగారంకు ఎన్ని కోట్లంటే?

Maa Inti Bangaaram Box Office Collections: స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ నందినీ రెడ్డి కాంబోలో రూపొందిన సినిమా మా ఇంటి బంగారం ( Maa Inti Bangaaram). ఫ్యామిలీ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమాని ట్రాలాలా మూవీంగ్ పిక్సర్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులు నిర్మించారు. జూలై 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే 50 కోట్ల రూపాయల మార్క్ అందుకుంది. మరి 7వ రోజు మా ఇంటి బంగారం ఎన్ని కోట్లు రాబట్టింది? సమంత హవా ఎలా ఉంది? ఈ వివరాలు పరిశీలిస్తే..

'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్‌లో భారీ వసూళ్లు సాధించినప్పటికీ, వీక్‌డేస్‌లో మాత్రం క్రమంగా కలెక్షన్లు తగ్గుతున్నాయి. బీవీ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 7 రోజు కూడా అదే ట్రెండ్‌ను కొనసాగించింది. గురువారం కలెక్షన్లు మరింత తగ్గడం ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. రోజువారీ ఇండియా నెట్ కలెక్షన్లను పరిశీలిస్తే.. తొలి రోజు రూ. 5. 35 కోట్లు, రెండో రోజు రూ. 7. 65 కోట్లు, మూడో రోజు రూ.10.10 కోట్లు వసూలు చేసి వీకెండ్‌లో సత్తా చాటింది. అయితే నాలుగో రోజు రూ. 4.10 కోట్లు, ఐదో రోజు రూ.3.50 కోట్లు, ఆరో రోజు రూ. 2.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

Maa Inti Bangaaram Day 7 expected Box Office Collection Samantha Film Eyes Rs 60 Crore Worldwide Gross

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆరో రోజు (జూన్ 25) ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.2.50 కోట్లు నెట్ వసూలు చేసింది. ఇందులో తెలుగు వెర్షన్‌నే ఎక్కువ. తెలుగులో 2,230 షోల ద్వారా రూ.2.35 కోట్లు రాగా, తమిళ వెర్షన్ 608 షోల నుంచి రూ.15 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా మరో రూ.1 కోటి గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆరు రోజులలో సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 33.20 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించగా, దీంతో గ్రాస్ రూ. 38.36 కోట్లకు చేరుకుంది. ఇక ఓవర్సీస్ లో రూ.17. 35 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.55. 71 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

7వ రోజు మా ఇంటి బంగారం అంచనా వసూలు
సమంత స్టార్ డమ్, పాజిటివ్ రివ్యూలతో సినిమా వీకెండ్ భారీ వసూలు అందుకున్న వీక్ డేస్ లో మాత్రం క్రమంగా పడిపోతున్నాయి. అయితే.. ఇలా పడిపోవడం సాధారణమే.. మార్నింగ్, మ్యాట్నీ షోల ఆక్యూపెన్సీ తగ్గువగా ఉన్నా.. ఫస్ట్ షో, సెకండ్ షోలకి మంచి ఆక్యూపెన్సీ నమోదవుతున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. 7వ రోజు మధ్యాహ్నం 3గంటల వరకు మా ఇంటి బంగారం సినిమాకు ఇండియాలో 1446 షోలు ప్రదర్శితమై రూ. 76 లక్షలు నెట్ వసూళ్లను సాధించినట్లు సాక్‌నిక్ వెల్లడించింది.

హైదరాబాద్‌లో అత్యధికంగా 456 షోలు, బెంగళూరులో 290 షోలు, విశాఖపట్నంలో 96 షోలు, విజయవాడలో 62 షోలు ప్రదర్శించగా, కరీంనగర్‌లో అత్యధికంగా 41 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. కానీ, ఈ షోల్లో నమోదైన సగటు ఆక్యుపెన్సీ దాదాపు 15 శాతంగా ఉంది. ఈ ట్రెండ్స్‌ను బట్టి చూస్తుంటే ఏడో రోజు మా ఇంటి బంగారం మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.8 కోట్ల నుంచి 2 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలు చొప్పున వరల్డ్ వైడ్‌గా రూ. 3.00 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మా ఇంటి బంగారం మూవీని రూ. 28 కోట్లతో తెరకెక్కించగా.. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 35 కోట్లుగా విలువ కట్టారు. దాంతో సమంత మూవీ లాభాల్లోకి రావాలంటే రూ. 70 కోట్ల గ్రాస్ రాబట్టాలని వాల్యూ నిర్దేశించారు. ఈ లెక్కన మరో రూ. 15 కోట్లు వసూలు చేస్తే సమంత మూవీ డిస్ట్రిబ్యూషన్ పరంగా బ్లాక్‌బస్టర్ ఇమేజ్‌ను సొంతం చేసుకోనుంది. అయితే నిర్మాతలు మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే 35 కోట్ల రూపాయలు దక్కించుకుని బడ్జెట్ పోగా లాభాలను పొందారనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X