MIB Day 8 Collections: మళ్లీ పుంజుకున్న 'మా ఇంటి బంగారం' కలెక్షన్లు.. సమంత మూవీకి ఎన్ని కోట్లంటే?

Maa Inti Bangaaram Box Office Collections: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కామెడీ మేళవింపుతో రూపొందిన ఈ సినిమాను సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సంయుక్తంగా నిర్మించారు. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్‌ను అందుకున్న ఈ సినిమా, తొలి వారం ముగిసే సమయానికి కూడా మంచి వసూళ్లను నమోదు చేసింది. ఇప్పుడు రెండో వీకెండ్ ప్రారంభం కావడంతో సినిమా మరోసారి కలెక్షన్లలో ఊపందుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి 8 వ రోజు 'మా ఇంటి బంగారం' ఎన్ని కోట్లు రాబట్టింది? సమంత హవా ఎలా ఉంది? ఈ వివరాలు పరిశీలిస్తే..

మా ఇంటి బంగారం తొలి రోజు నుంచి పాజివిట్ టాక్ తో దూసుకెళ్తుంది. వీకెండ్‌లో భారీ వసూళ్లు సాధించిన 'మా ఇంటి బంగారం'కు, వర్కింగ్ డేస్‌లో కాస్త కలెక్షన్లు తగ్గాయి. అయితే ఏడో రోజు నుంచి వసూళ్లు నిలకడగా కొనసాగుతుండగా, ఎనిమిదో రోజు మొహర్రం సెలవు కారణంగా ప్రేక్షకుల రద్దీ మరోసారి పెరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలుగులో పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో సమంత సినిమాకి అదనపు బలం చేకూరింది.

Maa Inti Bangaaram Day 8 expected Box Office Collection

సమంత సినిమా మొదటి వారంలో 35. 85 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది. రోజువారీ వసూళ్లను పరిశీలిస్తే.. తొలి రోజు 5. 35 కోట్ల రూపాయలు, రెండో రోజు 7.65 కోట్ల రూపాయలు, మూడో రోజు 10.10 కోట్ల రూపాయలు వసూలు చేసి వీకెండ్‌లో అదిరిపోయే కలెక్షన్లు అందుకుంది. ఆ తర్వాత నాలుగో రోజు 4.10 కోట్ల రూపాయలు, ఐదో రోజు 3.50 కోట్ల రూపాయలు, ఆరో రోజు 2. 50 కోట్ల రూపాయలు, ఏడో రోజు 2. 65 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

భాషల వారీగా చూస్తే తెలుగు వెర్షన్ లో ఈ సినిమా భారీ కలెక్షన్లు అందుకుంది. తొలి వారంలో తెలుగు వెర్షన్ ఒక్కటే 34. 05 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించగా, తమిళ వెర్షన్1.80 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. దీంతో ఈ సినిమాకు ప్రధాన ఆదరణ తెలుగు రాష్ట్రాల నుంచే లభిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా 'మా ఇంటి బంగారం' కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా 59.53 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో ఇండియన్ బాక్సాఫీస్ నుంచి 41. 43 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్ మార్కెట్ల నుంచి 18.10 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే వన్ మిలియన్ డాలర్ల క్లబ్ ‌లో చేరడం విశేషం.

8 రోజు కలెక్షన్ల అంచనా
ప్రస్తుతం సినిమా రెండో వీకెండ్‌లోకి అడుగుపెట్టింది. మొహర్రం పబ్లిక్ హాలిడే కారణంగా వరుసగా మూడు రోజుల సెలవులు రావడం, అదే సమయంలో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం 'మా ఇంటి బంగారం'కు కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మరోసారి థియేటర్లకు వస్తే కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రేడ్ వర్గాల లైవ్ అంచనాల ప్రకారం,8వ రోజు మధ్యాహ్నం వరకు 'మా ఇంటి బంగారం' దేశవ్యాప్తంగా 1,376 షోలలో ప్రదర్శితమవుతూ, 1.39 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించింది.

ఈ ట్రెడ్ చూస్తుంటే.. శుక్రవారం 3 కోట్ల నుంచి 3. 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముందని, దీంతో మొత్తం ఇండియా నెట్ కలెక్షన్లు 40 కోట్ల రూపాయలకు, ఇండియా గ్రాస్ 48 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్త వసూళ్లు 70 కోట్లకు చేరువ కావొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వెళ్లిన ఈ సినిమా, రెండో వీకెండ్‌లో భారీ వసూళ్లు నమోదు చేస్తే సమంత కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X