MIB Day 9 Collections: వీకెండ్‌లో 'మా ఇంటి బంగారం' దూకుడు.. సమంత మూవీకి ఎన్ని కోట్లంటే?

Maa Inti Bangaaram Box Office Collections: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకెళ్తోంది. దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కామెడీ కాంబోతో రావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీంతో మొదటి వారంలోనే 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు రెండో వీకెండ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మరోసారి కలెక్షన్లలో జోరు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి 9వ రోజు 'మా ఇంటి బంగారం'ఎన్ని కోట్లు రాబట్టింది? సమంత హవా ఎలా ఉంది? ఈ వివరాలు పరిశీలిస్తే.

సమంత మా ఇంటి బంగారం సినిమా మొదటి వారం ముగిసే సమయానికి ఈ సినిమా దేశవ్యాప్తంగా 35. 85 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు అందుకుంది. తొలి రోజు 5. 35 కోట్ల రూపాయలు, రెండో రోజు7. 65 కోట్ల రూపాయలు, మూడో రోజు10.10 కోట్ల రూపాయలు వసూలు చేసి వీకెండ్‌లో అద్భుతమైన వసూళ్లు అందుకుంది. ఆ తర్వాత వర్కింగ్ డేస్‌లో కలెక్షన్లు కొంత తగ్గినా, నాలుగో రోజు 4.10 కోట్ల రూపాయలు, ఐదో రోజు 3. 50 కోట్ల రూపాయలు, ఆరో రోజు 2. 50 కోట్ల రూపాయలు, ఏడో రోజు 2. 65 కోట్ల రూపాయల నెట్ వసూళ్లతో నిలకడగా కొనసాగింది.

Maa Inti Bangaaram Box Office Collections

ఇక రెండో శుక్రవారం సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద జోరు చూపించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, 8వ రోజు 'మా ఇంటి బంగారం' 4. 65 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది. ఏడో రోజు వచ్చిన 2. 65 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది 75.5 శాతం ఎక్కవ. రెండో వీకెండ్ ప్రారంభంలోనే ఇంత భారీ గ్రోత్ రావడంతో సినిమాపై ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతోంది. ఇక ఎనిమిది రోజులు ముగింపు నాటికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 40.50 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు అందుకోగా, అలాగే 46.83 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు అందుకుంటుంది.

ఇక విదేశీ మార్కెట్‌లో సమంత సినిమా తన సత్తా చాటుతోంది. ఎనిమిదో రోజు ఓవర్సీస్‌లో 35 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేయగా, మొత్తం ఓవర్సీస్ వసూళ్లు 18.30 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దీంతో మా ఇంటి బంగారం సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 65.13 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక భాషల వారీగా చూస్తే.. సినిమాకు ప్రధాన బలం తెలుగు వెర్షనే. ఎనిమిది రోజుల్లో తెలుగు వెర్షన్ నుంచి 38.45 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు నమోదు చేయగా, తమిళ వెర్షన్ 2.05 కోట్ల రూపాయల నెట్ మాత్రమే వసూలు చేసింది. దీంతో సినిమా విజయానికి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే ప్రధాన కారణమని చెప్పవచ్చు.

9వ రోజు అంచనా కలెక్షన్లు
రెండో వీకెండ్‌ (శనివారం)లోకి అడుగుపెట్టిన మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద మరోసారి జోరు చూపిస్తోంది. ట్రేడ్ లైవ్ ట్రాకింగ్ ప్రకారం.. 9వ రోజు (శనివారం) మధ్యాహ్నం వరకు ఈ సినిమా దేశవ్యాప్తంగా 334 నగరాల్లో 1,306 షోల ద్వారా సుమారు 1.85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఈ సమయంలో 23 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ట్రెండ్ ను చూస్తే.. సాయంత్రం, రాత్రి షోలకు ఆక్యుపెన్సీ మరింత పెరిగే అవకాశం ఉందనీ, శనివారం ముగిసే సమయానికి వసూళ్లు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రెండో శనివారం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముందని, దీంతో మొత్తం ఇండియా నెట్ కలెక్షన్లు 45 కోట్ల రూపాయలకు, ఇండియా గ్రాస్ 53కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ వైపు దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో 75 కోట్ల లక్ష్యంగా పరుగులు పెడుతున్న మా ఇంటి బంగారం నేడు (శనివారం) బ్రేక్ ఈవెన్ కానున్నట్టు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సమంత కెరీర్‌లో ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ, 'మా ఇంటి బంగారం' మాత్రం ఓ స్పెషల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలువబోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X