Maa Inti Bangaram Overseas Collection: నార్త్ అమెరికాలో సమంత జోరు.. మా ఇంటి బంగారానికి ఎన్ని కోట్లంటే?
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత, శ్రీముఖి, గౌతమి, శ్రీలక్ష్మీ తదితరులు నటించిన మూవీ మా ఇంటి బంగారం. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు సమంత. జూన్ 19న మా ఇంటి బంగారం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు ఏకంగా 13.15 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టిన సమంత.. తన రీ ఎంట్రీని ఘనంగా ఆరంభించింది. ఆ తర్వాత వీకెండ్‌లోనూ మా ఇంటి బంగారానికి భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓవర్సీస్‌లో మా ఇంటి బంగారం బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటీ? ఇప్పటి వరకు అక్కడ సమంత మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
ఇండియాలో మా ఇంటి బంగారం కలెక్షన్స్
మా ఇంటి బంగారం మూవీకి ఇండియాలో తొలిరోజున 5.35 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.65 కోట్ల రూపాయలు, మూడో రోజున 10.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 4.10 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు భారతదేశంలో 31.40 కోట్ల రూపాయల గ్రాస్.. 24.20 కోట్ల రూపాయల నికర వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఫస్ట్ వీకెండ్‌లో మా ఇంటి బంగారానికి తెలంగాణలో 10.15 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 5.38 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.43 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.50 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.94 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 60 లక్షల రూపాయలు చొప్పున భారత్‌లో 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది మా ఇంటి బంగారం.

మా ఇంటి బంగారం ఓవర్సీస్ కలెక్షన్స్
ప్రీమియర్స్‌లో సత్తా చాటిన మా ఇంటి బంగారం.. ఫస్ట్ వీకెండ్ నాటికే నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్లు (9.46 కోట్ల రూపాయలు) మార్క్ క్రాస్ చేసి ఓవర్సీస్‌లోనూ హవా చూపించారు సమంత. తద్వారా ఓవర్సీస్ మార్కెట్‌లో 6 నెలల తర్వాత క్లీన్ హిట్ అందుకున్న తెలుగు సినిమాగా మా ఇంటి బంగారం నిలిచింది. వర్కింగ్ డే అయిన సోమవారం కూడా 77K డాలర్లు (భారత కరెన్సీలో 73 లక్షల రూపాయలు) వసూలు చేసింది. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో మా ఇంటి బంగారం 1.15 మిలియన్ డాలర్లు (10.88 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలోనూ మా ఇంటి బంగారానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి. దాంతో ఓవర్సీస్‌లో సమంత మూవీ 14.60 కోట్ల రూపాయలు రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మా ఇంటి బంగారం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 46 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి 50 కోట్ల రూపాయల మార్క్‌ను క్రాస్ చేసేందుకు సిద్దమైంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి మా ఇంటి బంగారంను 28 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను ట్రాలాలా సంస్ధ సొంతంగా రిలీజ్ చేసింది. సమంత మూవీ లాభాల్లోకి రావాలంటే 36 కోట్ల రూపాయల షేర్.. 70 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. ఇప్పటికే ఓటీటీ, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారా రిలీజ్‌కు ముందే మా ఇంటి బంగారం 35 కోట్ల రూపాయలు రాబట్టి.. బడ్జెట్‌పై 7 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్‌ను అందుకుంది. ఇప్పుడు థియేట్రికల్‌గా 46 కోట్లు రాబట్టి డిస్ట్రిబ్యూషన్ పరంగానూ టార్గెట్ దిశగా దూసుకెళ్తోంది. మరి రానున్న రోజుల్లో సమంత జోరు ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications


