Maa Inti Bangaram Overseas Collection: నార్త్ అమెరికాలో సమంత విధ్వంసం.. మా ఇంటి బంగారానికి ఎన్ని కోట్లంటే?

నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన మా ఇంటి బంగారం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా.. సమంత స్టార్ పవర్‌ను చూపించింది. భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ మా ఇంటి బంగారానికి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ప్రీమియర్స్‌తో పాటు వీకెండ్‌లోనూ ఈ సినిమాకు ఎన్ఆర్ఐ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్‌లో మా ఇంటి బంగారం ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ కలిసి నిర్మించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు. జూన్ 19న మా ఇంటి బంగారం మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు 30 నుంచి 35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించినట్లుగా టాలీవుడ్ టాక్. మా ఇంటి బంగారం మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే 35 కోట్లు రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.

Maa Inti Bangaaram Overseas Box Office Collections Samantha Movie Heading Towards 1 Million Mark in North America

మా ఇంటి బంగారం కలెక్షన్స్
సమంత మూవీకి ఇండియాలో తొలిరోజున 5.35 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. రెండో రోజు ఈ సంఖ్య మరింత పెరిగింది. వీకెండ్, కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో ఈ మూవీకి ఇండియాలో రెండో రోజు ఏకంగా 7.50 కోట్ల రూపాయలు వచ్చింది. రెండ్రోజుల్లో ఈ సినిమాకు ఇండియాలో 12.85 కోట్ల రూపాయల నెట్.. 14.90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలైనట్లుగా సాక్‌నిక్ వెల్లడించింది.

మా ఇంటి బంగారం ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో సమంత మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 270 సెంటర్స్‌కు గాను ప్రీమియర్స్ + ఫస్ట్ డే వసూళ్లతో కలిపి సమంత మూవీకి 533,401 డాలర్లు (5.03 కోట్ల రూపాయలు) రాబట్టింది. వీటిలో ఒక్క ప్రీమియర్స్‌లోనే 280k డాలర్లు (2.64 కోట్ల రూపాయలు) వసూలైంది. ప్రీమియర్స్ + డే 1 కలెక్షన్స్‌లలో అమెరికా వాటా 507K డాలర్లు (4.78 కోట్ల రూపాయలు), కెనడా వాటా 26.5K డాలర్లు (25 లక్షల రూపాయలు) రాబట్టింది.

ఇక రెండో రోజు కూడా మా ఇంటి బంగారం ఇదే స్థాయిలో వసూళ్లను రాబట్టింది మా ఇంటి బంగారం. అమెరికాలోని 231 సెంటర్స్‌కు గాను శనివారం 260K డాలర్లు (2.45 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. తద్వారా ఒక్క నార్త్ అమెరికాలోనే మా ఇంటి బంగారం ఇప్పటి వరకు దాదాపు 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది 1 మిలియన్ మార్క్ దిశగా పరుగులు తీస్తోంది. నార్త్ అమెరికాలో మా ఇంటి బంగారం మూవీని రిఫండబుల్ కమీషన్ బేసిస్ మీద విడుదల చేశారు. సమంత మూవీ ఇక్కడ లాభాల్లోకి 1 మిలియన్ డాలర్లు (9.43 కోట్ల రూపాయలు) రాబట్టాల్సి ఉంది. మా ఇంటి బంగారం జోరు చూస్తుంటే వీకెండ్ నాటికి టార్గెట్ కొట్టేలా కనిపిస్తోంది.

ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో కలిపి మా ఇంటి బంగారం మూవీకి శనివారం మరో 2 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఓవర్సీస్‌లో సమంత మూవీ రెండో రోజు 4 కోట్ల రూపాయలకు పైగా రాబట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా జోరు చూస్తుంటే ఓవర్సీస్‌లో మరింత రెచ్చిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తం మీద భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ సినిమాకు రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 25.50 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. మరి వీకెండ్ ముగిసేనాటికి మా ఇంటి బంగారం వరల్డ్ వైడ్‌గా ఎంత రాబడుతుంది అనేది ఉత్కంఠగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X