Maa Inti Bangaaram Business: మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ బిజినెస్.. సమంత మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రినివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్, మ్యూజిక్: సంతోష్ నారాయణన్, ఫైట్స్: లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదర్ తదితరలు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రానికి జరిగిన బిజినెస్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Maa Inti Bangaaram Pre Release Business

మా ఇంటి బంగారం సినిమాను పక్కా ప్లానింగ్‌తో అతి తక్కువ రోజుల్లోనే పూర్తి చేయడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. నిర్మాతలు రాజ్ నిడిమోరు, హిమాంక్ ముందస్తు ప్లానింగ్, ఆర్టిస్టుల ఎంపిక, వారితో రిహార్సల్ లాంటి వ్యవహారాలను పకడ్బందీగా ఎగ్జిక్యూట్ చేయడంతో ఈ సినిమాను కేవలం 59 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది. ఈ సినిమాను ఎలాంటి రాజీ లేకుండా క్వాలిటీ, రిచ్‌నెస్‌తో రూపొందించారు. భారీగా తారాగణం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. యాక్షన్ కొరియోగ్రఫి, ఇతర సాంకేతిక అంశాలు బలంగా మారాయనే ఫీలింగ్ ప్రోమోలతో స్పష్టమైంది.

ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి సుమారుగా 28 నుంచి 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించినట్టు సమాచారం. ఈ బడ్జెట్‌లో సమంత రెమ్యునరేషన్ మినహాయింపుగా ఉంది. సొంత బ్యానర్ కావడంతో ఆమె రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాను కంప్లీట్ చేశారు. అయితే బిజినెస్ పూర్తయిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారం ఆమె రెమ్యునరేషన్ తీసుకొంటారనే విషయం తెలిసింది.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు కొనసాగిస్తున్న సమయంలోనే నాన్ థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్‌ను సుమారుగా 35 కోట్ల రూపాయల మేర బిజినెస్ క్లోజ్ చేశారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మాత్రం ఎవరికీ అమ్మడం జరగడం లేదని తెలిసింది. ఈ సినిమా కంటెంట్‌పై పూర్తిగా నమ్మకం ఉండటంతో సొంతంగా ట్రాలాలా రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాత్రం ఏరియాల వారీగా పలు సంస్థలుకు ఇచ్చారు. అయితే ఈ సినిమా థియేట్రికల్ వాల్యూను కూడా 30 నుంచి 35 కోట్ల రూపాయల మేర వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కనీసం 35 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేశారు.

మా ఇంటి బంగారం సినిమాపై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతున్నది. గతంలో సమంత నటించిన యశోద చిత్రం సుమారుగా 45 నుంచి 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదలైన అడ్వాన్స్ బుకింగ్‌కు, అలాగే తెలుగు రాష్ట్రాలు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X