Polimera 2 Collections పొలిమేర 2 మూవీకి ఊహించని కలెక్షన్లు.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
కరోనా లాక్‌డౌన్ తర్వాత ఓటీటీల హవా పెరిగిపోవడంతో థియేట్రికల్ రిలీజ్‌లపై అనుమానాలు ఉండటంతో మా ఊరి పొలిమేర సినిమాను డిజిటల్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను నేరుగా డీస్నీ+హాట్ స్టార్‌లో రిలీజ్ చేయగా అనూహ్యమైన రెస్సాన్స్ సొంత చేసుకొన్నది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్‌గా మా ఊరి పొలిమేర 2 సినిమాగా వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? చేసిన బిజినెస్ ఎంత? ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలి అనే విషయాల్లోకి వెళితే..
సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను తదితరులు నటించిన పొలిమేర 2 చిత్రానికి మొదటి నుంచి భారీ క్రేజ్ ఏర్పడింది. టీజర్లు, ట్రైలర్ల బాగా ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో నవంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది.

పొలిమేర 2 సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ మూవీ నటీనటులు రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి అంతా 6 కోట్ల మేర బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. ఇక సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో బిజినెస్ కూడా ఊహించని విధంగా జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 4 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పొలిమేర 2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉండటంతో థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ మూవీని సుమారుగా 400 స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 8 కోట్ల గ్రాస్, 4 కోట్ల రూపాయలకుపైగా షేర్ రాబట్టాల్సిన పరిస్థితి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక మా ఊరి పొలిమేర 2 సినిమా ఆక్యుపెన్సీ గ్రాండ్‌గానే కనిపించింది. ఈ సినిమాకు తొలి రోజు ఓవరాల్‌గా 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా మార్నింగ్, మ్యాట్నీ షోకు 30 శాతం ఆక్యుపెన్సీ, ఫస్ట్ షోకు 40 శాతం, సెకండ్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 45 శాతం, వరంగల్‌లో 45 శాతం, వైజాగ్‌లో 35 శాతం, మహబూబ్ నగర్‌లో 25 శాతం, కాకినాడలో 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ మూవీ 1.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్ట వచ్చని అంచనా వేశారు. ఇందులో ఆంధ్రా, తెలంగాణలోనే భారీ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని లెక్క కట్టారు.


Click it and Unblock the Notifications











