Polimera 2 Movie 11 Days Collections: చరిత్ర సృష్టించిన పొలిమేర 2.. 11 రోజుల్లో అన్ని కోట్లేంటి సామీ
తెలుగు సినీ పరిశ్రమలో హర్రర్ జోనర్‌లో వచ్చిన థ్రిల్లర్ సినిమాలు ఫెయిల్ అయిన సందర్భాలు చాలా తక్కువ అనే చెప్పాలి. అందుకే ఇలాంటి చిత్రాలు తరచూ ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. అలా ఇటీవలే విడుదలైన క్రేజీ మూవీనే 'మా ఊరి పొలిమేర 2' మూవీ. చేతబడుల కాన్సెప్టుతో వచ్చిన ఈ భయంకరమైన చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో 'మా ఊరి పొలిమేర 2' సినిమా 11 రోజుల వసూళ్లపై మీరే లుక్కేయండి మరి!
హిట్ మూవీకి సీక్వెల్ వచ్చింది:ఓటీటీలో విడుదలై సక్సెస్ అయిన పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిందే 'మా ఊరి పొలిమేర 2'. సత్యం రాజేష్ ప్రధాన పాత్ర చేసిన దీన్ని అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. ఇందులో కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు. దీనికి జ్ఞాని సంగీతం అందించారు.

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:చేతబడుల కాన్సెప్టుతో వచ్చిన 'మా ఊరి పొలిమేర' ఓటీటీలో విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'మా ఊరి పొలిమేర 2' మూవీని థియేటర్లలో తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. దీనికి ఆరంభంలోనే మంచి హైప్ వచ్చింది. దీనికితోడు ప్రచార చిత్రాలకు రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం మొత్తంగా రూ. 3.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయింది.
11వ రోజు తెలుగులో ఎంతంటే:'మా ఊరి పొలిమేర 2' సినిమాకు మంచి టాక్ రావడంతో మొదటి నుంచీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందన లభిస్తోంది. వీక్ డేస్‌లోనూ ఈ సినిమా మంచి స్పందననే సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే 11వ రోజు హాలీడే ఉండడంతో దీనికి వసూళ్లు పెరిగాయి. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు ఈ సినిమా రూ. 46 లక్షలు షేర్‌ను అందుకుంది.

11 రోజులకూ కలిపి ఎంతంటే:'మా ఊరి పొలిమేర 2' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లోనూ అదిరిపోయే స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రం నైజాంలో రూ. 4.32 కోట్లు, సీడెడ్‌లో రూ. 88 లక్షలు, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 3.00 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. ఇలా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.20 కోట్లు షేర్, రూ. 15.25 కోట్లు గ్రాస్ వసూలైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:హర్రర్ స్టోరీతో రూపొందిన 'మా ఊరి పొలిమేర 2' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ విభిన్నమైన సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి 11 రోజుల్లో రూ. 1.10 కోట్లు షేర్ వచ్చింది. వీటితో కలిపితే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 9.30 కోట్లు షేర్, 18.20 కోట్లు రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన 'మా ఊరి పొలిమేర 2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 4.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. 11 రోజుల్లోనే రూ. 9.30 రాబట్టింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.30 కోట్లు లాభాలతో సంచలనం సృష్టించింది.


Click it and Unblock the Notifications











