Polimera 2 Movie 1st Week Collections: 4 కోట్ల మూవీ.. వారంలో రికార్డు వసూళ్లు.. లాభాలతో పెను సంచలనం

మిగిలిన అన్ని జోనర్లతో పోల్చుకుంటే హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్టులతో వచ్చే చిత్రాలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తూ ఉంటుంది. అందుకే అలా రూపొందిన సినిమాలు ఘన విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పుడు అలా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'మా ఊరి పొలిమేర 2' మూవీ. క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో 'మా ఊరి పొలిమేర 2' సినిమా 7 రోజుల వసూళ్లపై మీరే లుక్కేయండి మరి!

హర్రర్ స్టోరీతో వచ్చిన సినిమా : ఓటీటీలో విడుదలై హిట్ కొట్టిన పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిందే 'మా ఊరి పొలిమేర 2'. సత్యం రాజేష్ ప్రధాన పాత్ర చేసిన ఈ సినిమాను అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. ఇందులో కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు. దీనికి జ్ఞాని సంగీతాన్ని సమకూర్చాడు.

Maa Oori Polimera 2 Movie 1st Week Worldwide Official Box Office Collections

అన్ని కోట్లు బిజినెస్ చేసింది : హర్రర్ కాన్సెప్టుతో రూపొందిన 'మా ఊరి పొలిమేర' ఓటీటీలో విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'మా ఊరి పొలిమేర 2' మూవీని థియేటర్లలో తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. దీనికి ఆరంభంలోనే మంచి హైప్ వచ్చింది. దీనికితోడు ప్రచార చిత్రాలకు రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం మొత్తంగా రూ. 3.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

7వ రోజు తెలుగులో ఎంతంటే : 'మా ఊరి పొలిమేర 2' మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి నుంచీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందన లభిస్తోంది. వీక్ డేస్‌లోనూ ఈ సినిమా మంచి స్పందననే సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే 7వ రోజు మంచిగానే హోల్టు చేసింది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు ఈ సినిమా రూ. 37 లక్షలు షేర్‌, రూ. 70 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

Maa Oori Polimera 2 Movie 1st Week Worldwide Official Box Office Collections

7 రోజులకూ కలిపి ఎంతంటే : తెలుగు రాష్ట్రాల్లో 'మా ఊరి పొలిమేర 2' మూవీకి వారం రోజుల్లోనూ అదిరిపోయే స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రం నైజాంలో రూ. 3.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 72 లక్షలు, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 2.46 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. ఇలా 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.93 కోట్లు షేర్, రూ. 12.92 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే : భయపెట్టే కథతో వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ విభిన్నమైన సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి 7 రోజుల్లో రూ. 96 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపితే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 7.79 కోట్లు షేర్, 15.20 కోట్లు రాబట్టింది.

Maa Oori Polimera 2 Movie 1st Week Worldwide Official Box Office Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత : డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన 'మా ఊరి పొలిమేర 2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 4.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. 7 రోజుల్లోనే రూ. 7.79 రాబట్టింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.79 కోట్లు లాభాలతో సంచలనం సృష్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X