Polimera 2 Movie 5 Days Collections: చిన్న మూవీకి భారీ వసూళ్లు.. ఏకంగా అన్ని కోట్లు.. లాభాలు ఎంతంటే!

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విభిన్నమైన కాన్సెప్టులతో సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్ని హర్రర్ జోనర్‌లో వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి. ఇప్పుడు అలా విడుదలైన సినిమానే 'మా ఊరి పొలిమేర 2'. గతంలో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మొదటి పార్ట్ సూపర్ హిట్ అవడంతో.. ఇప్పుడు దీన్ని థియేటర్లలో తీసుకొచ్చారు. ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో వసూళ్లు భారీగా వస్తున్నాయి. వీక్ డేస్‌లో కూడా ఇది చక్కగా రాణిస్తోంది. ఈ నేపథ్యంలో 'మా ఊరి పొలిమేర 2' సినిమా 5 రోజుల వసూళ్లపై మీరే లుక్కేయండి మరి!

భయపెట్టే కథతో వచ్చిన మూవీ:చేతబడుల నేపథ్యంతో వచ్చి హిట్టైన పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిందే 'మా ఊరి పొలిమేర 2'. సత్యం రాజేష్ ప్రధాన పాత్ర చేసిన ఈ సినిమాను అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. ఇందులో కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు. దీనికి జ్ఞాని మ్యూజిక్ ఇచ్చాడు.

Maa Oori Polimera 2 Movie 5 Days Worldwide Official Box Office Collections

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:భయపెట్టే కథతో తెరకెక్కిన 'మా ఊరి పొలిమేర' ఓటీటీలో విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'మా ఊరి పొలిమేర 2' మూవీని థియేటర్లలో తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. దీనికి ఆరంభంలోనే మంచి హైప్ వచ్చింది. దీనికితోడు ప్రచార చిత్రాలకు రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం మొత్తంగా రూ. 3.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయింది.

5వ రోజు తెలుగులో ఎంతంటే:'మా ఊరి పొలిమేర 2' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందన లభిస్తోంది. వీక్ డేస్‌లోనూ ఈ సినిమా మంచి స్పందననే సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే 5వ రోజు ఈ క్రేజీ మూవీ మంచిగానే హోల్టు చేసింది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు ఈ సినిమా రూ. 64 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి సత్తా చాటుకుంది.

Maa Oori Polimera 2 Movie 5 Days Worldwide Official Box Office Collections

5 రోజులకూ కలిపి ఎంతంటే:'మా ఊరి పొలిమేర 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లోనూ అదిరిపోయే స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రం నైజాంలో రూ. 3.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 62 లక్షలు, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 2.21 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. ఇలా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.10 కోట్లు షేర్, రూ. 11.32 కోట్లు గ్రాస్ వసూలైంది.

Maa Oori Polimera 2 Movie 5 Days Worldwide Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:హర్రర్ కాన్సెప్టుతో వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ విభిన్నమైన సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి 5 రోజుల్లో రూ. 86 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపితే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 6.96 కోట్లు షేర్, 13.30 కోట్లు రాబట్టింది.

Maa Oori Polimera 2 Movie 5 Days Worldwide Official Box Office Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 4.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. 5 రోజుల్లోనే రూ. 6.96 రాబట్టింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.96 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X