Polimera 2 Day 1 Collections: పొలిమేర 2కు రికార్డు వసూళ్లు.. తొలి రోజే అన్ని కోట్లా.. ఆ మూవీల కంటే!

మిగిలిన జోనర్లతో పోల్చుకుంటే హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్టులతో వచ్చే సినిమాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఆ తరహాలో ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇలా ఇప్పుడు వచ్చిన చిత్రమే 'మా ఊరి పొలిమేర 2' మూవీ. గతంలో వచ్చిన 'మా ఊరి పొలిమేర'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాలతో శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి మొదటి రోజే భారీ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో 'మా ఊరి పొలిమేర 2' వసూళ్లపై మీరే లుక్కేయండి మరి!

భయపెట్టే కథతో వచ్చిన మూవీ:సత్యం రాజేష్ హీరోగా నటించిన సినిమానే 'మా ఊరి పొలిమేర 2'. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు. దీనికి జ్ఞాని సంగీతాన్ని అందించారు. ఇది కోనసీమ జిల్లాలో జరిగిన యదార్థ కథతో రూపొందింది.

 Maa Oori Polimera 2 Movie Day 1 Worldwide Official Box Office Collections

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:చేతబడుల నేపథ్యంతో భయపెట్టే కథతో రూపొందిన 'మా ఊరి పొలిమేర' సినిమా ఓటీటీలో విడుదలై భారీ సక్సెస్ సాధించింది. దీంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'మా ఊరి పొలిమేర 2' మూవీకి ఆరంభంలోనే మంచి గుర్తింపు దక్కింది. దీనికితోడు ఈ సినిమా ప్రచార చిత్రాలతో రెస్పాన్స్ భారీగా రావడంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 3.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది.

అలాంటి టాక్.. భారీ రెస్పాన్స్:హర్రర్ కాన్సెప్టుతో రూపొందిన 'మా ఊరి పొలిమేర 2' మూవీకి ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే సీన్ కనిపించింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన దానికంటే ఎక్కువే దక్కింది. దీంతో తొలి రోజే మీడియం రేంజ్ టాలీవుడ్ హీరోల సినిమాలతో సమానమైన వసూళ్లను ఈ సినిమా సాధించిందనే చెప్పుకోవాలి.

 Maa Oori Polimera 2 Movie Day 1 Worldwide Official Box Office Collections

తెలుగు రాష్ట్రాలో ఎంతంటే:'మా ఊరి పొలిమేర 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం నైజాంలో రూ. 78 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 58 లక్షలు వరకూ షేర్‌ను వసూలు చేసింది. ఇలా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.51 కోట్లు షేర్, రూ. 2.42 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:థ్రిల్లర్ ఎలిమెంట్లతో రూపొందిన 'మా ఊరి పొలిమేర 2' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ విభిన్నమైన సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి తొలి రోజు రూ. 32 కోట్లు షేర్ వచ్చింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1.83 కోట్లు షేర్, 3.05 కోట్లు రాబట్టింది.

 Maa Oori Polimera 2 Movie Day 1 Worldwide Official Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'మా ఊరి పొలిమేర 2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 4.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. మొదటి రోజే దాదాపు సగం అంటే రూ. 1.83 రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 2.17 కోట్లు షేర్ రాబట్టాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X