Polimera 2 Day 2 Collections: చిన్న సినిమాకు ఊహించని వసూళ్లు.. 2 రోజుల్లోనే అన్ని కోట్లు ఏంటి సామీ!
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హర్రర్ జోనర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి వీటికి మంచి స్పందన వస్తుండడంతో దర్శక నిర్మాతలు మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'మా ఊరి పొలిమేర 2'. గతంలో వచ్చిన 'మా ఊరి పొలిమేర'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాలతో గత శుక్రవారమే ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీనికి మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగానే వస్తోంది. ఈ నేపథ్యంలో 'మా ఊరి పొలిమేర 2' 2 రోజుల వసూళ్లపై మీరే లుక్కేయండి మరి!
చేతబడి నేపథ్యంతో వచ్చింది:ప్రముఖ హాస్య నటుడు సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమానే 'మా ఊరి పొలిమేర 2'. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీనికి జ్ఞాని సంగీతాన్ని సమకూర్చాడు.

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:హర్రర్ బ్యాగ్‌డ్రాప్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన 'మా ఊరి పొలిమేర' సినిమా ఓటీటీలో విడుదలై భారీ సక్సెస్ సాధించింది. దీంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'మా ఊరి పొలిమేర 2' మూవీకి ఆరంభంలోనే మంచి హైప్ వచ్చింది. దీనికితోడు ఈ సినిమా ప్రచార చిత్రాలతో రెస్పాన్స్ భారీగా రావడంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 3.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిపింది.
2 రోజులకూ కలిపి ఎంతంటే:'మా ఊరి పొలిమేర 2' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండో రోజు కూడా డీసెంట్ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం నైజాంలో రూ. 77 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 55 లక్షలు వరకూ షేర్‌ను వసూలు చేసింది. ఇలా రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.46 కోట్లు షేర్, రూ. 2.35 కోట్లు గ్రాస్ వసూలైంది.

2 రోజులకూ కలిపి ఎంతంటే:'మా ఊరి పొలిమేర 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లోనూ అదిరిపోయే స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రం నైజాంలో రూ. 1.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 29 లక్షలు, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 1.13 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. ఇలా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.97 కోట్లు షేర్, రూ. 4.77 కోట్లు గ్రాస్ వసూలైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'మా ఊరి పొలిమేర 2' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ విభిన్నమైన సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి 2 రోజుల్లో రూ. 54 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 3.51 కోట్లు షేర్, 6.00 కోట్లు రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'మా ఊరి పొలిమేర 2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 4.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. రెండు రోజుల్లోనే రూ. 3.51 రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 49 లక్షలు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











