Polimera 2 Day 3 Collections: పొలిమేర టార్గెట్ ఫినీష్.. ఏకంగా అన్ని కోట్లు ఔట్.. ఇదేం కొట్టుడు సామీ!
హర్రర్ కాన్సెప్టుతో వచ్చే సినిమాలు క్లిక్ అయితే బాక్సాఫీస్ బెండు తీస్తాయి. ఈ విషయం ఎన్నో సార్లు నిరూపణ కూడా అయింది. అందుకే ఆ తరహా సినిమాలతో దర్శక నిర్మాతలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఆడియెన్స్ ముందుకు వచ్చిన సినిమానే 'మా ఊరి పొలిమేర 2'. హిట్ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో గత శుక్రవారమే గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
దీనికి మంచి టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ భారీగానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'మా ఊరి పొలిమేర 2' 3 రోజుల వసూళ్లపై మీరే లుక్కేయండి మరి!

హర్రర్ కాన్సెప్టుతో వచ్చిందిగా: ఓటీటీలో విడుదలై సక్సెస్ అయిన పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిందే 'మా ఊరి పొలిమేర 2'. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. ఇందులో కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు. దీనికి జ్ఞాని సంగీతం ఇచ్చారు.

అన్ని కోట్లు బిజినెస్ చేసింది: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'మా ఊరి పొలిమేర' ఓటీటీలో విడుదలై భారీ సక్సెస్ సాధించింది. దీంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'మా ఊరి పొలిమేర 2' మూవీని థియేటర్లలో తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. దీనికి ఆరంభంలోనే మంచి హైప్ వచ్చింది. దీనికితోడు ప్రచార చిత్రాలకు రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం మొత్తంగా రూ. 3.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది.
3 రోజులకూ కలిపి ఎంతంటే: 'మా ఊరి పొలిమేర 2' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మూడో రోజు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం నైజాంలో రూ. 90 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 56 లక్షలు వరకూ షేర్‌ను వసూలు చేసింది. ఇలా ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.63 కోట్లు షేర్, రూ. 3.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

3 రోజులకూ కలిపి ఎంతంటే: 'మా ఊరి పొలిమేర 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనూ అదిరిపోయే స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రం నైజాంలో రూ. 2.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 46 లక్షలు, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 1.69 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. ఇలా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.60 కోట్లు షేర్, రూ. 8.52 కోట్లు గ్రాస్ వసూలైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: హర్రర్ జోనర్‌లో రూపొందిన 'మా ఊరి పొలిమేర 2' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ విభిన్నమైన సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి 3 రోజుల్లో రూ. 65 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపితే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 5.25 కోట్లు షేర్, 10.00 కోట్లు రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: భయపెట్టే కాన్సెప్టుతో రూపొందిన 'మా ఊరి పొలిమేర 2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 4.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. మూడు రోజుల్లోనే రూ. 5.25 రాబట్టింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.25 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











