రామ్ చరణ్ 'ఆరెంజ్' చిత్రం శాటిలైట్ రైట్స్ ఎంతకు అమ్మారంటే...
రామ్ చరణ్ తాజా చిత్రం "ఆరెంజ్" శాటిలైట్ రైట్స్ ని మాటీవీ వారు తీసుకున్నారు. రైట్స్ కోసం వారు ఆరున్నర కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్తున్నారు. నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా మగధీర తర్వాత విడుదల అయిన ఈ చిత్రంపై క్రేజ్ ఇప్పటికీ ఉండటంతో ఆ మొత్తం చెల్లించారంటున్నారు. అయితే చిరంజీవి వాటా ఉన్న ఛానెల్ కాబట్టి ఆ రేంజి మొత్తం ఇచ్చి ఆరెంజ్ రైట్స్ ని తీసుకున్నారని ఓ వర్గం అంటోంది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్ లో నాగబాబు ఈ చిత్రాన్ని దాదాపు 32 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు. అయితే రిలీజైన మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకోవటం మైనస్ గా మారింది. తర్వాత గ్రాడ్యువల్ గా కలెక్షన్స్ డ్రాప్ అవటం ప్రారంభించాయి. హీరో రామ్ చరణ్ మాత్రం నాలుగైదు రోజులు ఈ చిత్రం జనాల్లోకి పోవటానికి పడుతుందని, ఆ తర్వాత విజయం సాధించటం తధ్యమని హామీ ఇచ్చాడు కానీ ఆ మాట నిజం కాలేదు.


Click it and Unblock the Notifications











