Maargan Day 1 Collection: విజయ్ ఆంటోనీకి షాక్.. మార్గన్‌కు దారుణంగా ఓపెనింగ్స్.. ఎన్ని కోట్లంటే?

విజయ్ ఆంటోనీ హీరోగా లియో జాన్ పాల్ దర్శకత్వంలో తెరకెక్కిన మార్గన్ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అజయ్ దిశన్, సముద్రఖని, మహానంది శంకర్, బ్రిగిద సాగా, వినోద్ సాగర్‌లు కీలకపాత్రలు పోషించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్గన్ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది? తొలి రోజు విజయ్ ఆంటోనీ చిత్రం ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది? పరిశీలిస్తే..

మార్గన్ బడ్జెట్ ఎంత?
మార్గన్ చిత్రానికి యువ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. విజయ్ ఆంటోనీ స్వయంగా స్వరాలు సమకూర్చారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి మార్గాన్ చిత్రానికి రూ.10 కోట్ల నిర్మాణ వ్యయం అయ్యింది. ఉన్నంతలో టెక్నికల్ వాల్యూస్ తగ్గకుండా మేకర్స్ చర్యలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 స్క్రీన్లలో మార్గన్ సినిమాను విడుదల చేశారు. విజయ్ ఆంటోనీ కెరీర్‌లో అత్యధిక స్క్రీన్‌లలో విడుదలైన సినిమాగా మార్గన్ నిలిచింది.

Maargan Day 1 Box Office Collection worldwide Vijay Antony Movie Bags Poor Openings

డల్‌గా బుకింగ్స్
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో మార్గన్ సినిమాపై మంచి బజ్ నెలకొంది. తెలుగులో ఓవరాల్‌గా 18.89 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. తెలుగు వెర్షన్‌కు సంబంధించి హైదరాబాద్‌లో 89 షోలు, విజయవాడలో 27 షోలు, విశాఖలో 50 షోలు పడ్డాయి. అయితే ఆశ్చర్యకరంగా తెలుగు కంటే తమిళంలో బుకింగ్స్ మందకొడిగా జరిగింది. తమిళ వెర్షన్‌‌లో ఓవరాల్‌గా 18.19 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. చెన్నైలో 256, బెంగళూరులో 58, మధురైలో 63, కోయంబత్తూరులో 96 చొప్పున షోలు పడినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.

దారుణంగా కలెక్షన్స్
తొలిరోజు మార్గన్ చిత్రం సాధించిన వసూళ్లు చూస్తే .. ఈ సినిమాకు ఫస్ట్ డే ప్రేక్షకుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఒక్క తమిళనాడులోనే రూ.50 లక్షల నెట్ కలెక్షన్స్ రాగా.. తెలుగు రాష్ట్రాలు+ రెస్టాఫ్ ఇండియాలో మరో రూ.35 లక్షల చొప్పున ఇండియా వైడ్ నికరంగా 85 లక్షల రూపాయలు మాత్రమే ఓపెనింగ్స్ రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లో రూ.15 లక్షల వసూళ్లతో కలిపి మార్గన్ ఫస్ట్ డే కేవలం కోటి రూపాయల మాత్రమే రాబట్టినట్లు వెల్లడించింది. టాక్ పూర్తిగా బయటకు రాకపోవడంతో తొలిరోజు వసూళ్లు తగ్గాయని, రెండో రోజు నుంచి కలెక్షన్స్ బాగుండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కుబేరను దాటేసిన మార్గన్
మంచు విష్ణు నటించిన భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప ఎఫెక్ట్ .. మార్గన్‌పై పడినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించిన కుబేర చిత్రం గత వారం విడుదలైంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ తమిళనాడులో మాత్రం కుబేర పరాజయం పాలైంది. విజయ్ ఆంటోనీ నటించిన మార్గన్ ఎంట్రీతో తమిళనాడులో కుబేరకు థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. కుబేర చిత్రం జూన్ 27న కేవలం 22 లక్షలు వసూలు చేయగా.. మార్గన్ రూ.50 లక్షల కలెక్షన్స్ సాధించి దుమ్మురేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X