Mahaveerudu Collections.. బాక్సాఫీస్ వద్ద శివకార్తికేయన్ తడాఖా.. మహావీరుడుకి షాకింగ్ కలెక్షన్లు!

తమిళంలో స్టార్ హీరో శివ కార్తీకేయన్ నటించిన మహావీరుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మడోన్నే అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అదితి శంకర్ హీరోయిన్‌గా, సీనియర్ నటి సరిత, దర్శకుడు మిస్కిన్, తెలుగు నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకాల్లో అవినీతి, అక్రమాల నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం వినోదాత్మకంగా తెరకెక్కింది. జూలై 14వ తేదీన రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

తమిళంలో మావీరన్ సినిమాకు తెలుగు డబ్బింగ్ చిత్రంగా మహావీరుడు చిత్రం రూపొందింది. మాస్ మహారాజ్ రవితేజ ఓ ప్రత్యేకమైన అంశానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ఈ సినిమా ప్రభుత్వ అధికారుల పనితీరు, అక్రమాలపై సంధించిన అస్త్రంగా తెరకెక్కింది.

Maaveeran and Mahaveerudu Day 1 expected Box Office Collections worldwide

మావీరన్ (మహావీరుడు) సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారుగా 85 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తమిళనాడులో 600 స్క్రీన్లకుపైగా కేరళలో 200 స్క్రీన్లలో, ఏపీ, తెలంగాణలో 200 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.

శివ కార్తీకేయన్‌కు దక్షిణాదిలో ఉన్న భారీ క్రేజ్ కారణంగా మహావీరుడు సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి. 2023 సంవత్సరంలో ఈ సినిమా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన 5 చిత్రంగా తెరకెక్కింది. తమిళనాడులో భారీ కలెక్షన్లు, ఆక్యుపెన్సీ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Maaveeran and Mahaveerudu Day 1 expected Box Office Collections worldwide

ఇక మహావీరుడు సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ నమోదైంది. ఇక ఓటీటీ 32 కోట్ల రూపాయల బిజినెస్‌తో కలిపి మొత్తంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ 52 కోట్లుగా నమోదైంది. శాటిలైట్, బిజినెస్‌తో కలిపి ఈ చిత్రం 120 కోట్ల బిజినెస్ చేసింది.

మహావీరుడు సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ సినిమా తమిళనాడులో 8 కోట్ల మేర కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ఆంధ్రాలో 2 కోట్ల గ్రాస్ వసూళ్లు, కేరళలో 1 కోటి రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 13 నుంచి 14 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X