Mahaveerudu Collections.. మహావీరుడు కలెక్షన్ల వర్షం.. తమిళంలో రికార్డుల మోత
యువ దర్శకుడు మడొన్నే అశ్విన్ డైరెక్షన్‌లో టాలెంటెడ్ యాక్టర్ శివ కార్తీకేయన్, యువ హీరోయిన్ అదితి శంకర్ జంటగా నటించిన మహావీరుడు (Maaveeran) చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను సాధిస్తున్నది. తొలి రోజు తమిళంలో రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ స్టామినాను శివకార్తీకేయన్ ప్రూవ్ చేశారు. ఈ సినిమా 2023లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన ఐదో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. మహావీరుడు రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తమిళంలో మావీరన్ పేరుతో రూపొందించిన శివకార్తీకేయన్ సినిమాను తెలుగులో మహావీరుడు సినిమాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను మొత్తంగా 85 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 కిపైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో తొలి రోజు భారీ వసూళ్లు నమోదయ్యాయి.

మహావీరుడు (Maaveeran) సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 38 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. తెలుగులో సుమారు 6 కోట్ల మేర, కన్నడ, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్లు, ఓవర్సీస్‌లో 10 కోట్లతో మొత్తంగదా 60 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమాను బ్రేక్ ఈవెన్ 61 కోట్ల షేర్‌గా నిర్ణయించారు.
మహావీరుడు చిత్రం తొలి రోజు భారీ వసూళ్లను నమోదు చేసింది. తమిళనాడులో కలెక్షన్ల వర్షం కురిపించింది. తమిళంలో 7.6 కోట్లు, తెలుగులో 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 8.25 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాపత్ంగా 12 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఇక రెండో రోజు మహావీరుడు (Maaveeran) సినిమా ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెలితే.. తమిళంలో మార్నింగ్ షోకు 35 శాతం, మధ్యాహ్నం 55 శాతం, ఫస్ట్ షోకు 60 శాతం, సెకండ్ షోకు 65 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తెలుగు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. 20 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీ 20 శాతం, ఫస్ట్ షోకు 25 శాతం, సెకండ్ షోకు 20 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
మహావీరుడు (Maaveeran) రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 10 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. తమిళనాడులో 9 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ రాబట్ట వచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ చిత్రం మొత్తంగా 26 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











