Macherla Niyojakavargam day 3 collections నెగిటివ్ టాక్‌తో కూడా స్ట్రాంగ్‌గా.. నితిన్ నష్టాల నుంచి బయటపడాలంటే?
యువ హీరో, హీరోయన్లు నితిన్, కృతిశెట్టి జంటగా నటించిన మాచర్ల నియోజవర్గం భారీగా వసూళ్లు సాధించలేకపోయినా సెలవు దినాలు కలిసి రావడంతో నిలకడగా కలెక్షన్లు సాధిస్తున్నది. తొలి రోజు నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం ఆ రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమా 3వ రోజు సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..

3వ రోజున తెలుగు రాష్ట్రాల్లో
మాచర్ల నియోజకవర్గం చిత్రం మూడో రోజున ఏపీ, తెలంగాణలో మోస్తారు వసూళ్లను నమోదు చేసింది. నైజాంలో 38 లక్షలు, సీడెడ్‌లో 16 లక్షలు, ఉత్తరాంధ్రలో 14 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 10 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 లక్షలు, గుంటూరు జిల్లాలో 8 లక్షలు, కృష్ణా జిల్లాలో 11 లక్షలు, నెల్లూరు జిల్లాలో 5 లక్షల వసూళ్లు సాధించింది.

మొత్తం 3 రోజుల్లో నైజాం, ఆంధ్రాలో
మాచర్ల నియోజకవర్గం చిత్రం నైజాం, ఆంధ్రాలో ప్రాంతాల వారీగా సాధించిన మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 2.38 కోట్లు, సీడెడ్‌లో 1.12 కోట్లు, ఉత్తరాంధ్రలో 99 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 68 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 29 లక్షలు, గుంటూరు జిల్లాలో 73 లక్షలు, కృష్ణా జిల్లాలో 51 లక్షలు, నెల్లూరు జిల్లాలో 38 లక్షలు వసూలు చేసింది.

మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
ఇక మాచర్ల నియోజకవర్గం చిత్రం మొత్త మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించింది. తొలి రోజున రూ.4.62 కోట్లు, రెండో రోజున రూ.1.4 కోట్లు, మూడో రోజున రూ.1.06 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఈ చిత్రం గత మూడు రోజుల్లో రూ.7.08 కోట్ల షేర్, 11.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఇలా
ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటకలో 37 లక్షలు, ఓవర్సీస్‌లో 35 లక్షలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలతో కలిపి ఈ చిత్రం 7.80 కోట్ల షేర్, 12.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆగస్టు 15 సెలవుదినం రోజున కూడా సానుకూలంగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

మాచర్ల లాభాల్లోకి రావాలంటే?
ఇక మాచర్ల నియోజకవర్గం లాభనష్టాల విషయానికి వస్తే.. ఈ చిత్రం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 21.2 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 22 కోట్ల వసూళ్లు నమోదు చేయాల్సి ఉంది. మూడు రోజుల్లో ఈ చిత్రం 7.8 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇంకా కనీసం 14 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











