Macherla Niyojakavargam day 4 collections: మాస్ ఇమేజ్ తో నితిన్ పోరాటం.. తట్టుకున్నాడు కానీ?

మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నితిన్ ఈసారి మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో భారీ టార్గెట్ తోనే బరిలోకి దిగాడు. అయితే మిగతా సినిమాల నుంచి పోటీ ఎక్కువగా ఉండడం అలాగే మాచర్ల సినిమాకు అనుకున్నంతగా పాజిటివ్ రాకపోవడంతో కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోతున్నాయి. మొదటి రోజు బాగానే ఒపెనింగ్స్ వచ్చినా ఆ తర్వాత రోజుల్లో నితిన్ హవా చూపించలేకపోయాడు. ఇక 4వ రోజు సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి అలాగే సక్సెస్ కావాలి అంటే ఇంకా ఏ స్థాయిలో లాభాలు అందుకోవాలి అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

ఏరియాలో వారిగా సినిమా చేసిన బిజినెస్ వివరాలలోకి వెళితే.. నైజాంలో 6 కోట్ల ధర పలికిన ఈ సినిమా సిడెట్లో 5 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ లో 1.20 కోట్లు టార్గెట్ అక్కడ మార్కెట్లో విడుదలవుతోంది. ఇక తెలంగాణ ఆంధ్రలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కలుపుకొని మాచర్ల నియోజకవర్గం సినిమా 21.20 కోట్ల రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే సినిమా సక్సెస్ కావాలి అంటే 22 కోట్ల షేర్ అందుకోవాల్సి ఉంటుంది.

4వ రోజు ఏపీ తెలంగాణ కలెక్షన్స్

4వ రోజు ఏపీ తెలంగాణ కలెక్షన్స్

మాచర్ల నియోజకవర్గం సినిమా 4వ రోజున ఏపీ, తెలంగాణలో స్టాండర్డ్ గానే ఉన్నప్పటికీ టార్గెట్ కు ఈ నెంబర్లు సరిపోవు. నైజాంలో 40 లక్షలు, సీడెడ్‌లో 22 లక్షలు, ఉత్తరాంధ్రలో 16 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 10 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 లక్షలు, గుంటూరు జిల్లాలో 9 లక్షలు, కృష్ణా జిల్లాలో 11 లక్షలు, నెల్లూరు జిల్లాలో 5 లక్షల వసూళ్లు సాధించింది.

 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

4 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

మాచర్ల నియోజకవర్గం సినిమా నైజాం, ఆంధ్రాలో ప్రాంతాల వారీగా సాధించిన 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 2.78 కోట్లు, సీడెడ్‌లో 1.34 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.15 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 78 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 36 లక్షలు, గుంటూరు జిల్లాలో 84 లక్షలు, కృష్ణా జిల్లాలో 60 లక్షలు, నెల్లూరు జిల్లాలో 43 లక్షలు వసూలు చేసింది. మొదటి రోజున రూ.4.62 కోట్లు, రెండో రోజున రూ.1.4 కోట్లు, మూడో రోజున రూ.1.06 కోట్లు, 4వ రోజున 1.20 వసూళ్లు సాధించింది. దీంతో ఈ చిత్రం గత 4 రోజుల్లో ఏపీ తెలంగాణలో రూ.8.28 కోట్ల షేర్, 13.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

వరల్డ్ వైడ్ 4 రోజుల కలెక్షన్స్

వరల్డ్ వైడ్ 4 రోజుల కలెక్షన్స్

తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 8.28 కోట్లు రాబట్టిన ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 40 లక్షలు, ఓవర్సీస్‌లో 37 లక్షలు అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాలతో కలుపుకొని వరల్డ్ వైర్ గా నితిన్ సినిమా 9.05కోట్లు రాబట్టింది. ఇక 15 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది.

 బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే..

బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే..

మాచర్ల నియోజకవర్గం సినిమా 4 వ రోజు నిలకడగా కోటి షేర్ అందుకోవడం బాగానే ఉంది కాని 21.2 కోట్ల బిజినెస్ చేసిన ఈ ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 22 కోట్ల వసూళ్లు నమోదు చేయాల్సి ఉంది. అంటే ఇంకా టార్గెట్ కు చాలా దూరంలో ఉంది. మరో 12 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అయినట్లు లెక్క. మరి ఈ తీవ్రమైన పోటీలో మాచర్ల నియోజకవర్గం ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X